• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MAN WHOSE FATHER DONATED SPERM 500 TIMES AVOIDS DATING APPS BECAUSE HE SCARED TO RUN INTO HIS HALF SIBLINGS SU GH

తండ్రి చేసిన ఆ పనితో దెబ్బతిన్న కొడుకు డేటింగ్ జీవితం... ఇంతకీ ఏం జరిగిందంటే?

తండ్రి చేసిన ఆ పనితో దెబ్బతిన్న కొడుకు డేటింగ్ జీవితం... ఇంతకీ ఏం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ల రాకతో కొత్త కొత్త యాప్స్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత ఉపయోగించే యాప్స్ లో ఎక్కువగా డేటింగ్ యాప్స్ కూడా ఉంటున్నాయి.

  • Share this:
స్మార్ట్ ఫోన్ల రాకతో కొత్త కొత్త యాప్స్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత ఉపయోగించే యాప్స్ లో ఎక్కువగా డేటింగ్ యాప్స్ కూడా ఉంటున్నాయి. వీటి వినియోగం మన దగ్గర కాస్త తక్కువే అయినా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ యువతీ యువకుల మధ్య డేటింగ్ అనేది సర్వసాధారణం. అక్కడి యువత డేటింగ్ యాప్స్ ద్వారా తమకు ఇష్టమైన భాగస్వామిని ఎంచుకుంటుంటారు. అయితే, ఒక ఒరెగన్ కి చెందిన జేవ్ అనే యువకుడు మాత్రం డేటింగ్ యాప్స్ అంటే జంకుతున్నాడు. దీని వెనుక కారణం తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా రాష్ట్రం ఒరెగాన్ కి చెందిన 24 ఏళ్ల జేవ్ ఒక స్పెర్మ్ దాత సహాయంతో జన్మించాడు. తన తండ్రి ఎవరో అతడికి తెలియదు. తన తల్లే అతడిని పెంచింది. ఊహ తెలిసాక తన తండ్రి, అతడి వంశం గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ అతడికి నిరాశే మిలిగింది. తన తండ్రిని కనిపెట్టలేకపోయాడు. అయితే, జేవ్ కొంచెం పెద్దయ్యాక స్కూల్ కి వెళ్లే క్రమంలో అచ్చం తన పోలికలతో ఉన్న మరో విద్యార్థిని చూశాడు. అతడు తన తండ్రికి పుట్టిన వాడేనని గ్రహించాడు. ఇక, యుక్తవయస్సుకు వచ్చాక తన తోటి స్నేహితులలాగే డేటింగ్స్ యాప్స్ లో యువతులను పరిచయం చేసుకోని వారితో డేటింగ్ చేయాలనుకున్నాడు. కానీ, అతనికి తీవ్ర నిరాశే మిలిగింది. ఎందుకంటే అతడి తండ్రి దాదాపు 500 మందికి స్పర్మ్ డొనేట్ చేసి తనలాంటి మరో 50 మందికి జన్మనిచ్చినట్లు తెలుసుకున్నాడు.

అంతే కాదు.. జేవ్ తనకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతుల్లో కొందరు తన తోబుట్టువులు ఉండటాన్ని గుర్తించాడు. అందుకే ఎక్కడ తన తోబుట్టువులతో సహజీవనం చేయాల్సి వస్తుందేమోనని డేటింగ్స్ యాప్స్ కి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. దీని గురించి జేవ్ మాట్లాడుతూ “డేటింగ్ యాప్స్ ద్వారా ఇతరులలాగా సంబంధాలు కొనసాగించలేకపోతున్నా.. నేను ఎవరితోనైనా డేటింగ్ చేసే ముందు వారిని జన్యుపరంగా పరీక్షించిన తర్వాతే ఆ వ్యక్తితో సంబంధాన్ని కొసాగించాల్సి వస్తుంది. నాకు ఇప్పటివరకు డేటింగ్ యాప్స్ లో పరిచయమైన వారికి జన్యు పరీక్షలు చేయగా వారిలో ఎనిమిది మంది నా తోబుట్టువులని తేలింది. నాకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో తెలియకపోవడంతో నా డేటింగ్ జీవితం దెబ్బతింటోంది.’’ అంటూ జేవ్ వాపోయాడు.

ఎట్టకేలకు దొరికాడు..
తన తండ్రి, తోబుట్టువుల గురించి తెలుసుకోవడం తన జీవితానికి భద్రతనిస్తుందని జేవ్ నమ్ముతున్నాడు. అయితే, తన తండ్రి స్పర్మ్ డొనేట్ చేసి చాలా మందికి జన్మనివ్వడంతో అతని డేటింగ్ జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. అయితే, ఎట్టకేలకు జేవ్ తన తండ్రిని కనుగొన్నాడు. స్పెర్మ్ డొనేషన్ వెనుక గల కారణం గురించి అతని తండ్రిని అడిగ్గా.. డబ్బుల కోసం ఇలా చేశానని బదులిచ్చాడు. అంతేకాక, ఎంతో మందికి పిల్లలు కలగకపోవడాన్ని చూసి వారికి స్పెర్మ్ డొనేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు