ఆ చేప రేటు రూ.23 కోట్లు... సముద్రంలో పట్టుకొని వదిలేశారు... ఎందుకంటే...

Huge Tuna Fish : ట్యూనా చేపకు సంబంధించి వెస్ట్ కార్క్ చార్టెర్స్... ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ చేప మార్కెట్‌లో ఇప్పుడు రూ.23 కోట్లు పలుకుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 8:31 AM IST
ఆ చేప రేటు రూ.23 కోట్లు... సముద్రంలో పట్టుకొని వదిలేశారు... ఎందుకంటే...
ఆ చేప రేటు రూ.23 కోట్లు (Credit - FB - West Cork Charters)
Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 8:31 AM IST
Huge Tuna Fish : ఐర్లాండ్‌ తీరంలో 8.5 అడుగుల భారీ ట్యూనా చేప వెస్ట్ కార్క్‌కి చెందిన డేవ్ ఎడ్వార్డ్స్ వలకు చిక్కింది. కానీ దాన్ని తిరిగి నీటిలో వదిలేశారు. ఈ ఏడాది ఐర్లాండ్‌లో వలకు చిక్కిన అతి పెద్ద ట్యూనా చేప ఇదే. జపాన్‌లో దీని ధర రూ.23 కోట్లు పలుకుతుందని ఐరిస్ మిర్రర్ తెలిపింది. ఐతే... డేవ్ టీమ్ చేపలు పట్టే ఉద్దేశంతో వలలు వెయ్యలేదు. జస్ట్ చేపల్ని పట్టుకొని... తిరిగి వదిలెయ్యాలన్నది వారి కార్యక్రమం. తద్వారా అట్లాంటిక్ జలాల్లో చేపలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వెయ్యాలనుకున్నారు. ఐతే... భారీ ట్యూనా చేప... వలకు చిక్కడాన్ని ఒకరు ఫొటో తీశారు. దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అంత ఖరీదైన చేపను వదిలేయడంతో డేవ్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు.


భారీ ట్యూనాను పట్టిన తర్వాత దాని బరువు ఎంత ఉందో తెలుసుకున్నారు. మొత్తం 270 కేజీలు ఉంది. దానికి ట్యాగ్ తగిలించి, తిరిగి నీటిలో వదిలేశారు. చేపల్ని పట్టుకొని వదిలేసే కార్యక్రమం అక్టోబర్ 15 వరకూ సాగనుంది. ఇందులో మొత్తం 15 బోట్లు పాల్గొంటున్నాయి.

First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...