లైవ్‌లో టీవీ రిపోర్టర్‌కు షాక్.. ఆమె బ్యాక్‌పై కొట్టిన ఆకతాయి..

అతని చేష్టలకు సదరు రిపోర్టర్ షాక్ తిన్నది. కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయింది. ఆపై ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

news18-telugu
Updated: December 15, 2019, 12:09 PM IST
లైవ్‌లో టీవీ రిపోర్టర్‌కు షాక్.. ఆమె బ్యాక్‌పై కొట్టిన ఆకతాయి..
లైవ్ టీవీలో రికార్డయిన దృశ్యం
  • Share this:
అమెరికాలోని జార్జియాలో ఎన్‌బీసీ అనుబంధ సంస్థ WSAV-TV మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది.ఇటీవల సవన్నా బ్రిడ్జిపై జరిగిన మారథాన్‌ను లైవ్ రిపోర్ట్‌ చేస్తున్న సందర్భంలో.. ఓ ఆకతాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.మారథాన్‌లో భాగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ రన్నర్ రిపోర్టర్ వెనుక భాగంపై చెయ్యితో తట్టాడు. అతని చేష్టలకు సదరు రిపోర్టర్ షాక్ తిన్నది. కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయింది. ఆపై ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఏ మహిళా ఉద్యోగి ఇలాంటి చేదు అనుభవాన్ని చవిచూడాలనుకోదు అంటూ వ్యాఖ్యానించింది.

జరిగిన ఘటనపై ఆ రిపోర్టర్ సవన్నా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే తన తప్పును గ్రహించిన థామస్ అనే ఆ నిందితుడు

ఆమె పనిచేస్తున్న టీవీ స్టేషన్‌కు వచ్చి క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేసి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నిజానికి తాను ఆమె భుజంపై తట్టాలనుకున్నానని.. కానీ ఆ సమయంలో అనుకోకుండా ఆమె వెనుక భాగంపై కొట్టానని చెప్పాడు. అయినప్పటికీ రిపోర్టర్ ఫిర్యాదు మేరకు సవన్నా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


Published by: Srinivas Mittapalli
First published: December 15, 2019, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading