సెల్‌ఫోన్ దొంగకు భలే బుద్ధి చెప్పిందిగా... వైరల్ వీడియో

Johannesburg : దొంగలతో జాగ్రత్తగా ఉండాలి. మనం మన పనిలో ఉంటే... వాళ్లు అదే అదనుగా చోరీ చేస్తారు. ఈ వైరల్ వీడియోలో అదే జరిగింది.

news18-telugu
Updated: December 13, 2019, 7:48 AM IST
సెల్‌ఫోన్ దొంగకు భలే బుద్ధి చెప్పిందిగా... వైరల్ వీడియో
సెల్‌ఫోన్ దొంగకు భలే బుద్ధి చెప్పిందిగా... వైరల్ వీడియో
  • Share this:
Johannesburg, Sough Africa : ఓ మహిళ తనకు జరిగిన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఏంటంటే... అల్మా అనే మహిళ... దక్షిణ ఆఫ్రికాలోని... జోహన్నెస్‌బెర్గ్‌లో ఉంటోంది. ఓ సూపర్ మార్కెట్‌లో సామాన్లు కొనుక్కునేందుకు వెళ్లింది. అక్కడి ప్రొడక్ట్స్‌ను చూస్తుండగా... ఓ కేటుగాడు ఆమె వెనకే నడుస్తూ ముందుకెళ్లాడు. ఆ సమయంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ వెనక్కి తగిలించి ఉంది. ఆ కేటుగాడు... అలవోకగా... ఆమె హ్యాండ్‌బ్యాగ్ లోంచీ సెల్‌ఫోన్ లేపేశాడు. వెంటనే ఆమె కనిపెట్టింది. యూ రాస్కేల్ అంటూ... వాడి చేతిలోంచీ మొబైల్‌ను వెనక్కి తీసుకుంది. దీనిపై వాణ్ని మాటలతోనే చెడుగుడు ఆడుకుంది. తనకు జరిగినట్లే మిగతా వాళ్లకూ జరిగే ప్రమాదం ఉండటంతో... మీ హ్యాండ్ బ్యాంగ్‌లకు జిప్స్ వేసుకోండి. అలర్ట్‌గా ఉండంటి అంటూ ట్వీట్ చేసింది.

42 సెకండ్ల ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 2.48 లక్షల మంది దాన్ని చూశారు. దాదాపు 10 వేల మంది కామెంట్లు చేశారు. ఆమె అలా సెల్‌ఫోన్‌ను దొంగ నుంచీ వెంటనే తీసుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. దెబ్బకు దెబ్బ కొట్టారని అంటున్నారు. అందరూ ఇలా అలర్ట్‌గా ఉంటే... దొంగలకు చెక్ పెట్టినట్లే అంటున్నారు నెటిజన్లు.

 

Pics : ఈ బ్యూటీ అందాలు చూస్తే తట్టుకోలేరేమో...ఇవి కూడా చదవండి :

Bougainville : మరో కొత్త దేశం వస్తోందోచ్...

ఓం...క్రీం...హ్రీమ్... అన్నాడు... యువతిని రేప్ చేశాడు

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

అమ్మో కిలాడీ... డేటింగ్ పేరుతో రూ.73 లక్షలు దోపిడీ

గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు