ఇదో విచిత్ర ప్రేమ కథ. ఇంగ్లండ్‌లో జరిగింది. ఆమె వయసు 24. పేరు జెస్ ఆల్డ్రిడ్జ్. అతడి వయసు 29. పేరు రియాన్ షెల్టన్. ఇద్దరు ప్రేమికులు. ఎన్నో ఏళ్లు ప్రేమలో మునిగి తేలున్నారు. జెస్ట్ ఆల్డ్రిడ్జ్ రెండోసారి గర్భంతో ఉంది. డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తన ప్రియుడు, తన తల్లితో వెళ్లిపోయాడని తెలిసి ఆల్డ్రిడ్జ్ గుండె బద్దలయింది. ఇంగ్లండ్‌లోని గ్లాసెస్టెరషైర్లో ఈ ఘటన జరిగింది.
జెస్ ఆల్ట్రిడ్జ్, రియాన్ దంపతులకు ఇంతకు ముందే ఒక కూతురు ఉంది. ఇప్పుడు మగ బిడ్డ పుట్టాడు. ఆల్ట్రిడ్జ్ గర్భంతో ఉన్న సమయంలో వీరిద్దరు తల్లి ఇంటికి వెళ్లారు. ఆమె పేరు జార్జినా వయసు 44. గర్భంతో ఉన్న కూతురుకు చేదోడు వాదోడుగా ఉంటుందని భావిస్తే.. ఆమె అల్లుడితో ప్రేమలో పడింది. కూతురిని పట్టించుకోకుండా అతడితో రొమాన్స్ చేసేది. ఈ విషయం ఆల్ట్రిడ్జ్కు తెలియదు. ఆమెకు 9 నెలలు నిండడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మగబిడ్డ పుట్టాడు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లే.. తన భర్త, తల్లి కనిపించలేదు. ఏంటా అని ఆరా తీస్తే.. ఇద్దరు వెళ్లిపోయి వేరొక గ్రామంలో కాపురం పెట్టారని తెలిసింది.
రియాన్ ఇద్దరు పిల్లలకు తండ్రి. జార్జినా ఆరుగురు పిల్లలకు అమ్మమ్మ. కానీ వీరిద్దరు బాధ్యత మరిచారు. ఆమె లేటు వయసులో అల్లుడితో ఘాటు ప్రేమలో పడింది. ఇద్దరు వెళ్లిపోవడంతో ఆల్డ్రిడ్జ్ కన్నీరు మున్నీరులా విలపిస్తోంది. సొంత తల్లే తనకు ద్రోహం చేసిందని బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె తన తండ్రితో కలిసి నివసిస్తోంది. ఎక్కడైనా కూతురు కాపురాన్ని నిలబెట్టే తల్లులు ఉంటారు గానీ..కూతురు కాపురంలో నిప్పులు పోసి.. అల్లుడితో వెళ్లిపోయే తల్లిని చూడలేదని ఆమె వాపోయింది. ఇప్పటి వరకూ వారు క్షమాపణలు చెప్పలేదని కంటతడిపెట్టింది ఆల్డ్రిడ్జ్.