లైవ్‌ రిపోర్టింగ్.. రిపోర్టర్‌ని తుపాకీతో బెదిరించిన దుండగుడు.. షాకింగ్ వీడియో

లైవ్‌ రిపోర్టింగ్.. రిపోర్టర్‌ని తుపాకీతో బెదిరించిన దుండగుడు.. షాకింగ్ వీడియో

Image-Twitter

ఓ రిపోర్టర్ టీవీలో లైవ్ ఇస్తున్న సమయంలో దుండగుడు అతనిని తుపాకీతో బెదిరించాడు. రిపోర్టర్‌, అతనితో పాటు ఉన్న సిబ్బంది వద్ద నుంచి దోపిడికి పాల్పడ్డాడు

 • Share this:
  ఓ రిపోర్టర్ టీవీలో లైవ్ ఇస్తున్న సమయంలో దుండగుడు అతనిని తుపాకీతో బెదిరించాడు. రిపోర్టర్‌, అతనితో పాటు ఉన్న సిబ్బంది వద్ద నుంచి దోపిడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ దేశంలో చోటుచేసుకుంది. వివరాలు.. వారం రోజుల కిందట ఇసిడ్రో రొమెరో కార్బో మాన్యుమెంటల్ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగింది. ఈ నేపథ్యంలో DirecTV Sports చానల్‌కు చెందిన సిబ్బంది స్టేడియం బయట లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తున్నారు. ఆ చానల్‌కు చెందిన రిపోర్టర్ డియెగో ఆర్డినోలా(Diego Ordinola)లైవ్‌ రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ దుండగుడు ఒక్కసారిగా డియోగో వద్దకు వచ్చి గన్‌తో బెదిరించాడు. దీంతో డియోగో వెంటనే వెనక్కి జరిగాడు. దుండగుడు ఆవేశంగా ఇతర సిబ్బంది వైపు కూడా గన్ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు.

  ఆ తర్వాత వారి వద్ద నుంచి ఓ వస్తువును తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత అప్రమత్తమైన టీవీ సిబ్బంది అతడిని వెంబడించే ప్రయత్నం చేశారు. అయితే అతడు మరో వ్యక్తి బైక్‌పై ఎక్కి పరారయ్యాడు. ఈ వీడియోను రిపోర్టర్ డియోగో తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. "మేము ప్రశాంతమైన పరిస్థితుల్లో పనిచేసుకోలేకపోతున్నాం. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు" అని డియోగో పేర్కొన్నారు.  ఇక, రిపోర్టర్, సిబ్బందిని గన్‌తో బెదిరించిన నిందితుడు ముఖానికి మాస్క్, తలపై టోపి ధరించడంతో అతనిని గుర్తుపట్టడం కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు