Man Penis Fell Off Due To Infection : వైద్య చరిత్రలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పెరీనియం ఇన్ఫెక్షన్ కారణంగా పురుషాంగాన్ని కోల్పోవడం అసంభవం అనిపించేదైతే.. కృత్రిమ పురుషాంగం తయారుచేసి బాధితుడికి అమర్చడం వైద్య చరిత్రలో అరుదైన పరిణామం. పురుషాంగాన్ని కోల్పోయిన వ్యక్తికి డాక్టర్లు సర్జరీ చేసి, అతనికి మళ్లీ కొత్త జీవితాన్ని ఇచ్చారు.
ఇంగ్లాండ్ లోని నార్ ఫోల్స్క్ చెందిన మాల్కమ్ మాక్డొనాల్డ్(47)కు 2010లో అరుదైన ఇన్ఫెక్షన్ "పెరీనియం"సోకింది.ఇన్ఫెక్షన్ కారణంగా మాల్కమ్‌కు అతడి కాలి వేళ్లు, చేతుల వేళ్లు, పురుషాంగానికి రక్తసరఫరా తగ్గిపోయి అవి నల్లగా మారిపోయాయి. ఈ క్రమంలోనే 2014లో అతడి పురుషాంగం ఊడిపోయింది. వృషణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ ఘటనతో తీవ్ర కుంగుబాటుకు గురైన మాల్కమ్ తన అవయవం పొందడం కోసం చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే లండన్ యూనివర్సిటీ కాలేజీ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ రాల్ఫ్‌ను సంప్రదించాడు. తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. దీంతో ఊడిపోయిన పురుషాంగం స్థానంలో కొత్త అంగాన్ని ఏర్పాటు చేయాలని సర్జన్లు నిర్ణయించారు. మొదట అతడి చేతిపై అంగాన్ని మొలిపించి… అది పూర్తిగా పెరిగాక చేతి నుంచి తొలగించి సర్జరీ ద్వారా యథాస్థానంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.దీంతో మాల్కమ్ మాక్డొనాల్డ్ ఎడమ చేతిపై కొత్త పురుషాంగాన్ని తయారు చేశారు. అయితే, ఇక్కడే మాల్కమ్ ను దురదృష్టం వెంటాడింది.
ALSO READ ప్రియుడి కండోమ్స్ కి రంధ్రాలు..ప్రియురాలికి జైలు శిక్ష
2015లో సర్జరీ మొదలైనప్పటికీ అనివార్య కారణాలతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆపరేషన్ జరుగుతుండగా మాల్కమ్ శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. ట్రీట్మెంట్ కొనసాగిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని భావించిన డాక్టర్లు ఆపరేషన్ ని నిలిపివేశారు. దీంతో ఆ పురుషాంగం చేతికే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి మాల్కమ్ పురుషాంగాన్ని చేతికే ఉంచుకొని జీవించారు. ఈ క్రమంలోనే అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. ఇక 2021లో డాక్టర్లు మాల్కమ్ కు రెండో ఆపరేషన్ నిర్వహించారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి చేతికి ఉన్న పురుషాంగాన్ని.. అది ఉండాల్సిన ప్రదేశంలో అమర్చారు. ఈ సారి మాల్కమ్ కు అదృష్టం కలిసొచ్చింది. ఎలాంటి సమస్యలు లేకుండానే ఆపరేషన్ పూర్తయింది. మాల్కమ్ అవమానాలన్నింటికీ చెక్ పడేందుకు ఆరేళ్లకు పైగా సమయం పట్టింది.కరోనా ప్రభావంలో ఈ సర్జరీకి మరింత సమయం పట్టిందంటున్నారు డాక్టర్లు. అయితే ఈ సర్జరీకి అయిన మొత్తం ఖర్చు.. 50 వేల పౌండ్లు అంటే దాదాపు అరకోటి. ఇప్పుడు తనకు సంపూర్ణ మగాడిని అన్న భావన వచ్చిందని మాల్కమ్ తెలిపారు. తన సాధారణ పురుషాంగం కంటే కృత్రిమంగా తయారు చేసిందే చాలా మెరుగ్గా ఉందని చెప్పాడు. శృంగార జీవితం తిరిగి రాబోతోందని, అందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని మాల్కమ్ మాక్డొనాల్డ్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.