హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

షాకింగ్.. కదులుతున్న విమానంలో నుంచి కిందకు దూకేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే..

షాకింగ్.. కదులుతున్న విమానంలో నుంచి కిందకు దూకేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ ప్రయాణికుడు చేసిన పని విమానంలోని ప్రయాణికులతో పాటుగా, సిబ్బందిని ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంతకు అతడు చేసిన పని ఏమిటంటే.. కదులుతున్న విమానంలో నుంచి కిందకు దూకాడు.

ఓ ప్రయాణికుడు చేసిన పని విమానంలోని ప్రయాణికులతో పాటుగా, సిబ్బందిని ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంతకు అతడు చేసిన పని ఏమిటంటే.. కదులుతున్న విమానంలో నుంచి కిందకు దూకాడు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్ర‌వారం రాత్రి యూనైటెడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 5365(United Express flight 5365) సాల్ట్ లేక్ సిటీకి బయల్దేరింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అవ్వడానికి.. రన్‌వేపై కదులుతుంది.

ఈ సమయంలో ఆ విమానంలో ఉన్న ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. ఆకస్మాత్తుగా తన సీటులో నుంచి లేసి.. మొదట అత‌డు కాక్‌పిట్‌లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించాడు. తరువాత ఎమ‌ర్జెన్సీ డోర్ తెరిచి విమానం నుంచి కింద‌కు దూకాడు. విష‌యం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు గాయ‌ప‌డిన అత‌డ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌థ‌మ చికిత్స చేసి అనంత‌రం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇక, అతడి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. విమానంలోని ఇతర ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి: అదో పోలీసు కుటుంబం.. కోడలిపై మామ అత్యాచారం.. ఈ విషయం భర్తకు చెబితే..

ప్రేమ పెళ్లి.. శోభనం రోజు రాత్రి అనుహ్య ఘటన.. తెల్లవారుజామున గదిలోకి వెళ్లి చూస్తే..


 ఇక, ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఉలిక్కిపడ్డారు. టేకాఫ్‌కు సిద్దమైన విమానం.. తిరిగి గేట్ వద్దకు చేరుకుంది. ఈ ఘటనతో విమానం దాదాపు మూడు గంటలపాటు ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయింది. ఆ తర్వాత సాల్ట్ లేక్ సిటీకి బయలుదేరింది. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Flight, USA

ఉత్తమ కథలు