Shocking: బాలిక జట్టును కత్తిరించిన స్కూల్ టీచర్.. భారీ షాక్ ఇచ్చిన బాలిక తండ్రి.. ఏకంగా ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

స్కూల్స్‌లో కొందరు టీచర్లు పిల్లలతో ప్రవర్తించే విధానం వారి తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    స్కూల్స్‌లో కొందరు టీచర్లు పిల్లలతో ప్రవర్తించే విధానం వారి తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఓ మహిళా టీచర్.. విద్యార్థిని జట్టు కత్తిరించింది. ఇంటి చేరుకున్నాక బాలిక జట్టును చూసిన తల్లిదండ్రులు టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 7 కోట్ల పరిహారం చెల్లించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోర్టులో బాలిక తల్లిదండ్రులు దావా వేశారు. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకుంది.

    వివరాలు.. జూర్నీ(Jurnee) అనే 7 ఏళ్ల ఈ ఏడాది మార్చిలో స్కూల్‌ నుంచి ఇంటికి చేరుకున్నప్పుడు జట్టు కత్తిరించి ఉండటాన్ని ఆమె తండ్రి జిమ్మి హో‌ఫ్‌మేయేర్ (Jimmy Hoffmeyer) గుర్తించారు. ఒకవైపు జుట్టు కత్తిరించి ఉండటంతో బాలికను ఆమె తండ్రి ఏం జరిగిందని అడిగాడు. అందుకు బస్సులో తోటి విద్యార్థి.. జట్టును కత్తిరించినట్టుగా జూర్నీ తన తండ్రితో చెప్పింది. ఇందుకు సంబంధించి హోఫ్‌మేయేర్.. జూర్నీ చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం బాలిక జుట్టును సరిచేయడానికి సెలూన్‌ తీసుకెళ్లాడు. అక్కడ ఆమె జుట్టు సరిచేయబడింది.

    Dog In Bussiness Cabin: పెంపుడు కుక్క కోసం విమానం బిజినెస్‌ కేబిన్‌ మొత్తం బుక్ చేసిన ఓనర్.. ఎంత ఖర్చు చేశాడంటే..

    ఇక, ఇది జరిగిన రెండు రోజుల తర్వాత జూర్నీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు.. ఆమె జుట్టు మరోవైపు కత్తిరించడబడం హూఫ్‌మేయేర్ గుర్తించాడు. మరోసారి తోటి విద్యార్థి జుట్టు కట్ చేయడం మేమిటని అనుమానంతో జూర్నీని ప్రశ్నించాడు. ఇలా ఎందుకు చేయనిచ్చావని అడిగాడు. అందుకు బాలిక.. ఆ పని చేసింది టీచర్ అని తండ్రికి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న హోఫ్‌మేయేర్ స్కూల్‌పై, టీచర్‌పై చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.

    Son Files Case: తండ్రిపై కేసు వేసిన యువకుడు.. సాయం చేయమని పోలీసుల వద్దకు.. ఇంతకీ ఆ తండ్రి ఏం కోరాడంటే..

    ఇందుకు సంబంధించి గ్రాండ్ రాపిడ్స్‌లోని (Grand Rapids) ఫెడరల్ కోర్టులో జూర్నీ చదువుతున్న స్కూల్, లైబ్రెరీయన్, టీచర్ అసిస్టెంట్ దావా వేశాడు. రూ. 7 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. పాఠశాలలో రాజ్యంగ పరమైన హక్కులను ఉల్లంఘించారని హోఫ్‌మేయేర్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. జాతి వివక్ష చర్యకు పాల్పడ్డారని చెప్పాడు. స్కూల్‌లో నియమించే సిబ్బందిని సరైన శిక్షణ, క్రమశిక్షణ గురించి యజమాన్యం తెలియజేయడం లేదనే అభియోగాలు మోపారు.

    Married Woman: భర్త శారీరకంగా కలవడం లేదన్న భార్య.. సెక్స్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే..

    అయితే ఈ దావాపై స్కూల్ యజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై తాము థర్డ్ పార్టీతో విచారణ జరిపించామని తెలిపింది. టీచర్ ఈ పని మంచి ఉద్దేశంతోనే చేసినట్టుగా విచారణలో తేలిందని పేర్కొంది. ఈ ఘటన ఏ రకంగానూ జాతి వివక్షతో కూడినది కాదని స్కూల్ యజమాన్యం తన నిర్దోషితత్వాన్ని తెలియజేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: