Japan Crab : 1.2 కేజీల పీత రేటు ఎంతుంటుంది? మహా అయితే రూ.500 నుంచీ రూ.1000 దాకా ఉండొచ్చు. కానీ... జపాన్‌లో స్నో క్రాబ్ (అదో రకం పీత)ను వేలం వెయ్యగా... ఓ వ్యక్తి దాన్ని ఏకంగా రూ.3,26,659 కొనుక్కున్నాడు. ప్రపంచంలో ఓ పీత అంత రేటు పలకడం ఇదే తొలిసారి. జపాన్... పశ్చిమాన టొట్టోరీ ప్రాంతంలో ఈ వేలం జరిగింది. ఏటా సీజన్ రాగానే... ఫస్ట్ వేలం జరిగినప్పుడు... ఇలాగే అత్యధిక రేటు పెట్టి కొంటారు. ట్యూనా చేపలు, పుచ్చకాయలు వంటి వాటిని వేలంలో కొంటారు. తాజా వేలంలో పీతను భారీ రేటు పెట్టుకొనుక్కోవడం చూసి స్థానిక ప్రభుత్వాధికారులు ఆశ్చర్యపోయారు. కేజీ 200 గ్రాముల బరువున్న ఆ పీత... 14.6 సెంటీమీటర్ల పొడవుంది.
Snow crab sells for record $46G at auction in Japan NEWS pic.twitter.com/AjWZWuGAlE
— News (@News53198949) November 8, 2019
గతేడాది ఇలాగే ఓ పీతను... రూ.1,30,663కు కొన్నారు. అప్పట్లో అది అత్యంత ఖరీదైన పీతగా గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ధరకు కొన్నారు కాబట్టి... ఇదే అత్యంత ఖరీదైన పీతగా రికార్డ్ సృష్టించనుంది. దీన్ని గిన్నీస్ బుక్ ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
స్థానిక రిటైలర్ ఒకాయన ఈ పీతను కొన్నాడు. జపాన్‌లోని గ్లిట్జీ గింజా డిస్ట్రిక్ట్‌లో ఉన్న అత్యంత కాస్ట్లీ రెస్టారెంట్లో దీన్ని వండి వడ్డించారు.
జనవరిలో... టోక్యోలో అతి పెద్ద ట్యూనా చేప వేలం జరగగా... ఓ వ్యాపారి దానికి రూ.22 కోట్లు చెల్లించాడు. అలాగే... రెండు నాణ్యమైన పుచ్చకాయలు వేలంలో... రూ.20,91,346 పలికింది.
Pics : బ్రైడల్ ఫొటోషూట్‌లో మెరిసిన జియా మానెక్
ఇవి కూడా చదవండి :
గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్లో అదే చర్చ
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందు మరో 4 కేసులు...
25వేల ఉద్యోగులు... 10 కోట్ల ఫోన్లు... షామీ విజయప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్
జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...
అయోధ్యలో రామమందిరం ఎలా ఉంటుందో తెలుసా... ఇలా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Japan, VIRAL NEWS, World