వామ్మో... బొద్దింకల్ని చంపడానికి బాంబు పేల్చాడు... ఆ తర్వాత

Viral Video : పంటకు పురుగు పడితే... పంటను తగలబెట్టుకుంటామా... లేదు కదా. అతను మాత్రం అదే చేశాడు. పురుగుల్ని చంపడానికి ఏకంగా గ్యాస్ బాంబు పేల్చాడు.

news18-telugu
Updated: October 26, 2019, 10:11 AM IST
వామ్మో... బొద్దింకల్ని చంపడానికి బాంబు పేల్చాడు... ఆ తర్వాత
బొద్దింకల్ని చంపడానికి బాంబు పేల్చాడు... ఆ తర్వాత (credit - twitter - Klara Sjöberg)
  • Share this:
Viral Video : బ్రెజిల్‌లో ఆ ఇంటి యజమాని సెసార్ షుమిట్జ్ (48) భార్య... లాన్‌ (lawn)లో బొద్దింకల్ని చూసి చిరాకుపడింది. "గార్డెన్ నిండా ఆ బొద్దింకలు ఎందుకొస్తున్నాయి... నాకు అవంటే విపరీతమైన భయం. మీరేం చేస్తారో నాకు తెలీదు... అవి పోవాలంతే" అంది. భార్యంటే వల్లమాలిన ప్రేమ ఉన్న సెసార్... "డోంట్ వర్రీ మందు వేస్తాగా" అన్నాడు. "మందులకు బొద్దింకలు చచ్చే రోజులు ఎప్పుడో పోయాయ్... అవి లాన్ లోపల మట్టిలో గూడు కట్టుకున్నాయి. ఆ గూడు నాశనం అవ్వాల్సిందే" అంది. "వాక్కే... నేను చూసుకుంటా" అంటూ గడ్డిలోని ఓ కన్నంలో గ్యాసోలిన్ వచ్చేలా చేశాడు. అందులోకి అగ్గిపుల్ల వెలిగించి వెయ్యాలనుకున్నాడు. రెండుసార్లు ఫెయిలైనా మూడోసారి సక్సెస్ అయ్యాడు. అలా అగ్గిపుల్ల గడ్డిలోని గ్యాసోలిన్‌లో పడిందో లేదో... ఇలా ఒక్కసారిగా లాన్ మొత్తం పేలిపోయింది. అక్కడి ఓ టేబుల్ ఎగిరి పడింది. కుక్కలు భయంతో పక్కకు పరిగెత్తాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇంత చేసినా బొద్దింకలు మాత్రం చావలేదు. ఓ బొద్దింక అతని వెనక నుంచీ వెళ్తున్నట్లు వీడియోలో మనం చూడొచ్చు.

చిత్రంగా అనిపించలా. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆదివారం ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తే... లక్షల మంది ఒకటికి రెండుసార్లు చూసి... అయ్యో అలా చేశాడేంటి అంటున్నారు. తాజాగా తెలిసిందేంటంటే... సెసార్... తన లాన్‌ను మళ్లీ సెట్ చేసుకున్నాడట. తిరిగి గడ్డి మొలిచేలా చేశాడట. బొద్దింకల సమస్య కూడా తీరిందని చెప్పాడు. ఇలాంటిదే ఓ ఘటన గతేడాది కాలిఫోర్నియాలో జరిగింది. అక్కడి ఫ్రెస్నోలో... ఇంట్లోని సాలెపురుగుల్ని చంపేందుకు మొత్తం ఇంటిని తగలబెట్టుకున్నాడు దాని యజమాని. సమస్యకు సొల్యూషన్ వెతకాల్సిన చోట... సమస్యపైనే ఇరిటేషన్ తెచ్చుకుంటుండటంతో ఇలాంటివి జరుగుతున్నాయి.

 

Pics : హాట్ పకోడీలా అదరగొడుతున్న జినాల్ జోషీ
ఇవి కూడా చదవండి :

మాన్‌హట్టన్‌పై బర్డ్ ఐ వ్యూ... అదిరిపోయిందిగా...

వామ్మో... బొద్దింకల్ని చంపడానికి బాంబు పేల్చాడు... ఆ తర్వాత

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి
First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>