Home /News /international /

MAN BITTEN BY NEIGHBORS ESCAPED PYTHON WHILE SITTING ON THE TOILET IN AUSTRALIA SK

షాకింగ్.. టాయిలెట్‌లోకి చొరబడి...అతడి పురుషాంగం కొరికేసిన కొండచిలువ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు 1.6 మీటర్లు పొడవున్న కొండ చిలువ టాయిలెట్‌లో ఉండడంతో అతడు షాక్ తిన్నాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగుపెట్టాడు. పురుషాంగంపై చిన్న గాయమే కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

    చిన్న పామును చూస్తేనే చాలా మంది భయంతో వణికిపోతారు. ఇక పెద్ద పాము కంట పడిందా.. ప్రాణాలరచేత పట్టుకొని పరుగులు పెడతారు. మరి కొండ చిలువ కనబడితే.. అది కూడా టాయిలెట్‌‌లో ఉంటే.. ఇంకేమైనా ఉందా? ఊహించుకోవడానికి భయం వేస్తుంది. తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. కానీ ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఓ పొడవాటి కొండ చిలువ టాయిలెట్‌లోకి దూరి అతడి పురుషాంగాన్ని కొరికేసింది. ఆస్ట్రేలియా మీడియా కథనం ప్రకారం.. గ్రాజ్​ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఉదయాన్నే బాత్‌రూమ్‌కు వెళ్లారు. టాయిలెట్ సీట్ మీద కూర్చున్న వెంటనే పురుషాంగాన్ని ఏదో కరిచినట్లుగా అనిపించింది. వెంటనే కిందకు చూస్తే కొండ చిలువ కనిపించింది. దాదాపు 1.6 మీటర్లు పొడవున్న కొండ చిలువ టాయిలెట్‌లో ఉండడంతో అతడు షాక్ తిన్నాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగుపెట్టాడు. పురుషాంగంపై చిన్న గాయమే కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.


    ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కొండచిలువ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీశారు. ఈ క్రమంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు పొరుగింట్లో 24 ఏళ్లు యువకుడు నివసిస్తున్నాడు. అతడు పాములు, కొండ చిలువలను పెంచుతున్నాడు. ఆ యువకుడి వద్ద 11 పాములు ఉన్నట్లు గుర్తించారు. ఐతే ఆ పాములు అంత విషపూరితమైనది కాదు. అతడి నిర్లక్ష్యం వల్లే కొండ చిలువ పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి టాయిలెట్‌లోకి డ్రేనేజీ ద్వారా వెళ్లిందని గుర్తించారు. పాముల పెంపకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అక్కడి చేరుకొని కొండ చిలువను టాయిలెట్‌ నుంచి బయటకు తీశారు. అనంతరం ఆ యువకుడికి తిరిగి అప్పగించారు. ఇక బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొంది.. అనంతరం ఇంటికి వెళ్లిపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Australia, Python

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు