హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అసలైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ.. తప్పిపోయిన కుక్క కోసం వెతికితే.. తెరపైకి సంచలనాలు

అసలైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ.. తప్పిపోయిన కుక్క కోసం వెతికితే.. తెరపైకి సంచలనాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్రోనిన్ ఒక డిటెక్టివ్‌లా మారి కుక్కల అక్రమ రవాణా విషయాన్ని కనుగొన్నాడని పోలీసులు తెలిపారు. అతడు చేసిన పనిని ప్రశంసించారు. దొంగిలించిన 70 కుక్కల్లో 22 పెంపుడు జంతువులను వాటి యజమానులకు తిరిగి అప్పగించారు.

తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి.. కుక్కల అక్రమ రవాణాను గుర్తించిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు కుక్క పిల్లలను దొంగిలించి, వాటిని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. యూకేలో ఈ ఘటన జరిగింది. టోనీ క్రోనిన్ అనే వ్యక్తి పెంచుకుంటున్న ఐదు స్పానియల్స్ జాతి కుక్క పిల్లలు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాయి. అవి దొంగతనానికి గురయ్యాయని అతడికి అర్థమైంది. దీంతో వాటిని వెతికి పట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే కుక్కల అక్రమ వ్యాపారం గురించి కనుగొన్నాడు. ఒక డిటెక్టివ్‌గా మారి ఏకంగా 70 దొంగిలించిన కుక్కలను క్రోనిన్ గుర్తించడం విశేషం. కుక్కల గురించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న సమయంలో అతడికి ఒక ముఠా గురించి తెలిసింది. వారి నెట్‌వర్క్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు.


దొంగిలించిన కుక్కలను దాచిన కార్మార్తెన్ షైర్ ప్రాంతానికి క్రోనిన్ వెళ్లాడు. అక్కడ వివిధ జాతులకు చెందిన విలువైన 70 కుక్కలను బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. వీటి విలువ 40వేల యూరోలుగా ఉంటుందని తెలిపారు. వాటిని ఇతర ప్రాంతాలకు రవాణా చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. లాబ్రాడార్, వెస్టీ, పగ్ వంటి ఎన్నో జాతుల కుక్కలను దొంగిలించి అక్కడ బంధించారు. ఈ గుంపులో ఉన్న తన పెంపుడు కుక్కలను క్రోనిన్ కనుగొన్నాడు. ఆ గది లోపలికి వెళ్లగానే కుక్కలన్నీ దీనంగా సాయం కోసం అరిచాయని అతడు వివరించాడు.

పోలీసుల ప్రశంసలు

క్రోనిన్ ఒక డిటెక్టివ్‌లా మారి కుక్కల అక్రమ రవాణా విషయాన్ని కనుగొన్నాడని పోలీసులు తెలిపారు. అతడు చేసిన పనిని ప్రశంసించారు. దొంగిలించిన 70 కుక్కల్లో 22 పెంపుడు జంతువులను వాటి యజమానులకు తిరిగి అప్పగించారు. మిగిలిన వాటిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. కుక్కలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. కొన్ని గ్రూపులు వాటిని దొంగిలించి, అక్రమంగా అమ్ముకుంటున్నాయని పోలీసులు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకుంటామని వెల్లడించారు

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Crime, Crime news, Dog, United Kingdom

ఉత్తమ కథలు