జైలు నుంచి తప్పించుకున్న 30 ఏళ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.. కారణం తెలిస్తే అవాక్కవుతారు

ప్రతీకాత్మక చిత్రం

డార్కో గంజాయి పెంచాడన్న నేరంపై మూడున్నర ఏళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష విధించారు. 13 నెలలు జైలులో బాగానే గడిపాడు. ఆ తర్వాతే డార్కోకు చిరాకు వచ్చి జైలు నుంచి బయటపడ్డాడు.

  • Share this:
ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. దీంతో.. కొన్ని రోజులు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత ఎలాగోలా జైలు నుంచి తప్పించుకోగలిగాడు. పోలీసులకు దొరకకుండా సుమారు 30 ఏళ్ల పాటు బాగానే బతికాడు. కానీ ఇటీవల అతడు స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. బయట ఉండటం కంటే జైలులో ఉండటమే మేలు అనుకొని వెళ్లి పోలీసులకు లొంగిపోయి.. మళ్లీ జైలుకు వెళ్తా అని మొర పెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన డార్కో డౌగీ డెసిక్ గురించే మనం మాట్లాడుకునేది. 1992, ఆగస్టు 1న న్యూసౌత్ వేల్స్ లో ఉన్న జైలు నుంచి అతడు తప్పించుకున్నాడు. తను ఉంటున్న గదిలోనే సొరంగం తవ్వుకొని బయటపడ్డాడు. డార్కో గంజాయి పెంచాడన్న నేరంపై మూడున్నర ఏళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష విధించారు. 13 నెలలు జైలులో బాగానే గడిపాడు. ఆ తర్వాతే డార్కోకు చిరాకు వచ్చి జైలు నుంచి బయటపడ్డాడు.

డార్కో కోసం పోలీసులు గాలించని ప్రదేశం లేదు. కానీ అతడు ఎక్కడ ఉన్నాడో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. పోలీసుల నుంచి తప్పించుకొని 29 ఏళ్ల పాటు ఎలాగోలా బతికేశాడు డెసిక్. కానీ ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. తనకు జైలు జీవితమే బెటర్ అనిపిస్తోందని అతడు కారణం చెప్పడంతో పోలీసులు షాక్ అయిపోయారు.

అయితే డార్కో పోలీసులకు లొంగిపోవడానికి ప్రధాన కారణం.. కోవిడ్ మహమ్మారి. కరోనా వల్ల ఆస్ట్రేలియా వ్యాప్తంగా చాలారోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో డార్కోకు పని దొరకలేదట. చివరకు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాడట. దీంతో రోడ్ల మీదనే ఉంటూ తిండీతిప్పలు లేకుండా చాలారోజులు గడిపాడట. ఇక తన వల్ల కాకపోవడంతో ఈ బతుకు బతికేకన్నా.. జైలు జీవితం బెటర్ అని భావించాడు. వెంటనే డీ వై అనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను లొంగిపోతున్నట్టు పోలీసులకు తెలిపాడు.

తను జైలు నుంచి పారిపోయాక మిగిలిన జైలు జీవితం మరో సంవత్సరం మీద నెల రోజులు ఉంది. అన్ని రోజులు జైలు జీవితాన్ని డార్కో గడపాల్సి ఉంటుంది. అయితే.. జైలులో ఉండగా తప్పించుకొని పారిపోయినందుకు.. డార్కోకు మరో 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే మరో 8 ఏళ్ల పాటు డెసిక్ జైలులో గడపాల్సి ఉంటుందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు.

Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..

YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?

ఇన్ని రోజులు తమ మధ్య ఉండి.. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన డార్కోను ఆదుకోవడానికి చాలామంది ఇప్పుడు ముందుకొస్తున్నారు. జైలుకు వెళ్లాడని తెలుసుకొని అతడిని విడిపించడానికి కొందరు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన్ను విడిపించి ఆయనకు కొత్త జీవితం ఇస్తామని.. ఆయన చాలా హార్డ్ వర్కర్, డీసెంట్ అని స్థానికులు చెబుతున్నారు. 30 ఏళ్లలో ఆయన ఏనాడూ ఎవరితో గొడవ పడటం కానీ.. ఎవరితో మాట్లాడటం కానీ చూడలేదని చెప్పడం విశేషం.
Published by:Kishore Akkaladevi
First published: