హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Mali Terror Attack: ఉగ్రవాదుల బీభత్సం.. బస్సుపై భీకర కాల్పులు.. 32 మంది మృతి

Mali Terror Attack: ఉగ్రవాదుల బీభత్సం.. బస్సుపై భీకర కాల్పులు.. 32 మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mali Terror Attack: మాలిలో కొన్ని నెలలుగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అల్ ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు.

పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు (Mali Terror Attack) బీభత్సం సృష్టించారు. ఓ బస్సుపై మెరుపు దాడి చేసి భీకర కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడిలో 32 మంది ప్రయాణికులు మరణించారు. బండియాగ్రా సమీపంలో ఈ ఘటన జరిగింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. సోంగో గ్రామానికి చెందిన స్థానికులు బండియాగ్రాలోని ఓ మార్కెట్‌కు బస్సులో వెళ్తున్నారు. ఆ బస్సు వారంలో రెండు రోజులు నడుస్తుంది. శుక్రవారం కూడా సోంగోతో పాటు చుట్టుపక్కల గ్రామలకు చెందిన మహిళలు మార్కెట్‌లో పనిచేసేందుకు వెళ్లారు. బస్సులో వెళ్తుండగా వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. నడిరోడ్డుపై బస్సును ఆపి ముందు బస్సు డ్రైవర్‌ను చంపేశారు. ఆ తర్వాత బస్సు టైర్లలో గాలి తీసి.. తుపాకులతో ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అంతటితో ఆగలేదు. బస్సుపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

Omicron: డేంజరస్ వైరస్.. 38 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. కానీ అదొక్కటే ఊరట..

ఈ ఘటనలో బస్సులో ఉన్న 32 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సు తగులబడుతున్న దృశ్యాలు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Lockdown: మళ్లీ అక్కడ షరతులతో కూడిన లాక్ డౌన్.. వ్యాక్సిన్ తీసుకోని వారికి హెచ్చరికలు..

మాలిలో కొన్ని నెలలుగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అల్ ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ మాలిలో మిలిటెంట్లు పేట్రేగిపోతున్నారు. ఇటీవల యూఎన్ కాన్వాయ్‌పై దాడి చేశారు. ఆ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ భీకర దాడి జరిగింది. మాలిలో ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాట్లు కూడా అక్కడి దారుణ పరిస్థితులకు ఒక కారణం. గత 16 నెలల్లో రెండు సార్లు తిరుగబాటు జరిగింది. బలహీనమైన ప్రభుత్వాలు ఉండడంతోనే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత మే నెలలోనే మాలిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. తాజా ఉగ్రదాడిపై ఆ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

First published:

Tags: Africa, Mali, Terror attack

ఉత్తమ కథలు