అధికారు ఉంటే చాలు... దానితో ప్రజలకు సేవ చెయ్యడం మానేసి... అవినీతికి పాల్పడుతుంటారు కొందరు. మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ ఇలాగే చేసి... నేరస్థుడయ్యారు. కౌలాలంపూర్ హైకోర్టు ఆయనకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రజాక్... ప్రస్తుతం ప్రతిపక్ష నేత. 2009 నుంచి 2018 వరకు మలేసియా ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో మలేషియా డెవలప్‌మెంట్ బెర్హాద్ (1 MDB) ఫండ్‌లో అవినీతి జరిగిందని తేలింది. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చెయ్యగా... వాస్తవాలు బయటికొచ్చాయి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, నమ్మక ద్రోహానికి ఆయన పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. కోర్టు మూడు నేరాలకూూ కలిపి శిక్షలు అమలయ్యేలా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సంచలనం అయ్యింది. ఎందుకంటే... ఇదివరకు ఎప్పుడూ మలేసియాలో ప్రధానులకు శిక్షలు విధించలేదు.
నజీబ్ రజాక్ ప్రధానిగా ఉంటూ మలేషియాలో NRC ఇంటర్నేషనల్ సంస్థ నుంచి రూ.73 కోట్లకు పైగా... ట్రాన్స్‌ఫర్ చేశారు. అలాగే... తన పదవీ కాలంలో... రూ.300 కోట్ల నుంచి రూ.375 కోట్ల దాకా ప్రభుత్వ ధనాన్ని తన అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇంత దోచుకున్నాక వదిలేయడానికి అది మామూలు దేశం కాదు మలేసియా. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.
హైకోర్టు తీర్పు ఇచ్చిందే కానీ... 67 ఏళ్ల నజీబ్ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు. ఎందుకంటే... శిక్ష అమలయ్యే విషయంలో ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తీర్పు ఇచ్చింది ఒక్క జడ్జే కాబట్టి... దీనిపై అప్పీలుకు వెళ్తానని ఆయన అన్నారు. అంటే అప్పీలులో... ఒకరి కంటే ఎక్కువమంది జడ్జిలు కేసును విచారిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Malaysia