మలేసియా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ రాజు సుల్తాన్ ముహమ్మద్-5 రాచరికాన్ని త్వజించారు. రాచరిక నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల ఆయన...క్రైస్తవ మతానికి చెందిన రష్యా మాజీ బ్యూటీ క్వీన్‌ను పెళ్లాడారు. దీంతో ఆయన భవితవ్యంపై కొంతకాలంగా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో రాచరికనాన్ని త్వజిస్తున్నట్లు ప్రకటించి సుల్తాన్ ముహమ్మద్-5 అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముస్లీం ప్రజలు మెజార్టీలుగా ఉన్న మలేసియాలో 1957లో బ్రిటన్ నుంచి స్వాతంత్రం సాధించిన తర్వాత రాచరికాన్ని త్వజించిన తొలి రాజు సుల్తాన్ ముహమ్మద్-5 కావడం విశేషం. మలేసియా 15వ రాజు పదవి నుంచి జనవరి 6(ఆదివారం) నుంచి ఆయన తప్పుకున్నట్లు మలేసియా నేషనల్ పేలస్ ఓ ప్రకటనలో తెలిపింది. తాను పదవి నుంచి ఎందుకు తప్పుకుంటున్నానో సుల్తాన్ ముహమ్మద్-5 వెల్లడించలేదు.
క్రైస్తవ మతానికి చెందిన మాజీ మిస్ మాస్కో ఒక్సానా ఓవదీనా (25)ను మలేసియా రాజు ముహమ్మద్-5 (49) గత ఏడాది నవంబరు మాసంలో పెళ్లి చేసుకున్నారు. ఓవదీనా గతంలో చైనా, థాయ్‌ల్యాండ్‌లో మోడలింగ్ చేశారు. ఈ వివాహం కోసం మలేసియా రాచరిక ఆచారాల ప్రకారం ఓవదీనా ఇస్లాం మతం స్వీకరించి రిహానాగా మారినట్లు కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరి మధ్య ఎప్పుడు, ఎలా ప్రేమ చిగురించిందో వెల్లడికాలేదు. అటు ఓవదీనాతో తన పెళ్లికి సంబంధించి మలేసియా రాజు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Malaysia