news18-telugu
Updated: October 17, 2020, 9:41 AM IST
Food Delivery: వస్తూ వస్తూ కండోమ్స్ తీసుకురా... ఫుడ్ డెలివరీ బాయ్ షాక్... ఏం చేశాడంటే... (credit - facebook)
Condoms with food delivery: మలేసియాలో ఓ ఫుడ్ డెలివరీ రైడర్.. ఫుడ్ తోపాటూ... కండోమ్స్, శానిటరీ ప్యాడ్స్ కూడా డెలివరీ చేశాడు. ఈ విషయాన్ని క్యాటీ చాన్... సోషల్ మీడియాలో అందరికీ చెప్పింది. డెలివరీ బాయ్... తన చిత్రమైన రిక్వెస్టును ఆమోదించడం ఆనందం కలిగించిందని తెలిపింది. తను, తన బాయ్ ఫ్రెండ్ కలిసి కండీషనల్ మూమెంట్ కంట్రోల్ ఆర్డర్ (CMCO) కింద సెక్స్ లో పాల్గొనాలనుకున్నట్లు ఆమె వివరించింది. అలా పాల్గొనాలంటే కండోమ్స్ తప్పనిసరి. కానీ ఇదివరకు తమ దగ్గర ఉన్న కండోమ్స్ అన్నీ అయిపోయిన విషయం అప్పుడు ఆమెకు తెలిసింది. ఇంట్లోంచీ బయటకు వెళ్లడం ఇష్టం లేని ఆమె... లంచ్ టైమ్ లో టేకవుట్ ఆర్డర్ ఇచ్చింది. వస్తూ వస్తూ... తన కోసం కండోమ్స్ కొనమనీ... వాటికి డబ్బులు ఇచ్చేస్తానని ఆమె రిమార్క్ సెక్షన్ లో రిక్వెస్ట్ రూపంలో తెలిపింది. డెలివరీ బాయ్... నిజంగానే కండోమ్స్ కూడా తెచ్చి ఫుడ్ తో పాటూ ఇచ్చాడు. అవి ప్రీమియం లాటెక్స్ కండోమ్స్. వాటికి తాను డబ్బు చెల్లించినట్లు ఆమె తన సోషల్ మీడియా పోస్టులో తెలిపింది.

ఫుడ్ తో పాటూ... అదనంగా కోరినవీ డెలివరీ (credit - facebook)
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును బట్టీ... ఆ డెలివరీ బాయ్... హంగ్రీ అనే ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ కంపెనీలో ఫుడ్ డెలివరీకి మొబైల్ యాప్ ఉంది. మొత్తానికి ఇంట్లోంచీ బయటకు వెళ్లకుండానే ఆమె కండోమ్స్ తెప్పించుకున్నట్లైంది. అదే రోజు సాయంత్రం ఆమె మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేసింది.

ఫుడ్ తో పాటూ... అదనంగా కోరినవీ డెలివరీ (credit - facebook)
ఈసారి ఫుడ్ డెలివరీ చేస్తూ... శానిటరీ ప్యాడ్స్ కూడా తెమ్మని రిమార్క్ సెక్షన్ లో రిక్వెస్ట్ పెట్టింది. ఈసారి కూడా ఆమె కోరినట్లు డెలివరీ బాయ్... శానిటరీ ప్యాడ్ కూడా ఫుడ్ తో పాటూ తెచ్చి ఇచ్చాడు. దానికి ఆమె డబ్బు చెల్లించింది.

ఫుడ్ తో పాటూ... అదనంగా కోరినవీ డెలివరీ (credit - facebook)
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 300 మందికి పైగా దీన్ని షేర్ చేశారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఉందని ఓ నెటిజన్ తెలిపారు. తాను ఫుడ్ పాండా నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తూ... సిగరెట్స్ తెమ్మని కోరాననీ, డెలివరీ బాయ్... నిజంగానే అవి కూడా తెచ్చి ఇచ్చారని తెలిపారు. ఇలా ఫుడ్ తో పాటూ... అదనంగా కోరినవీ తెచ్చి ఇస్తున్న డెలివరీ బాయ్స్ కి హాట్సాప్ అంటున్నారు నెటిజన్లు.
Published by:
Krishna Kumar N
First published:
October 17, 2020, 9:41 AM IST