కోతి కొట్టేసిన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే...షాకింగ్...

దురదృష్టవశాత్తూ ఫోన్ పోయిందని బాధపడుతున్న వ్యక్తికి ఎలాగోలా అది దొరికింది. కానీ ఆ ఫోన్ ను పరిశీలించిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.

news18-telugu
Updated: September 16, 2020, 9:11 PM IST
కోతి కొట్టేసిన స్మార్ట్ ఫోన్ ఓపెన్  చేసి చూస్తే...షాకింగ్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
దురదృష్టవశాత్తూ ఫోన్ పోయిందని బాధపడుతున్న వ్యక్తికి ఎలాగోలా అది దొరికింది. కానీ ఆ ఫోన్ ను పరిశీలించిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. తన ఫోన్ గ్యాలరీలో కోతులు సెల్ఫీలు, వీడియోలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వింత సంఘటన మలేషియాలో జరిగింది. తాను నిద్రపోతున్నప్పుడు ఎవరో ఫోన్ దొంగిలించారని మలేషియాకు చెందిన 20 ఏళ్ల జాక్రిడ్జ్ రోడ్జి అనే వ్యక్తి చెబుతున్నాడు. ఫోన్ పోయిన మరుసటి రోజు, తన ఇంటి బయట ఒక కోతి కూర్చొని ఉన్నట్టు రోడ్జి తండ్రి చెబుతున్నాడు. ఫోన్ పోయిన విషయం తెలియగానే ఆ నంబరుకు కాల్ చేశారు. అది రింగ్ అవుతుండటంతో ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఒకచోట చెట్టుకింద బురదలో ఆ ఫోన్ కూరుకుపోయినట్లు వారు గుర్తించారు. ఫోన్ను పరిశీలించినప్పుడు దాంట్లో కోతుల ఫోటోలు, వీడియోలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వారి ఇంట్లో దొంగతనం జరిగినట్టు ఎలాంటి సంకేతాలు లేవు. దీంతో ఫోన్ ఎలా పోయింది, దాంట్లో కోతుల ఫోటోలు, వీడియోలు ఎలా వచ్చాయో తెలియట్లేదు. బహుశా కోతులే ఫోన్ను తీసుకెళ్లి అడవిలో వదిలేసి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.

బీబీసీ వార్తాసంస్థ స్వాధీనం చేసుకున్న ఆ వీడియో ఫుటేజ్ను చూస్తే.. ఒక కోతి ఫోన్ను తినేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఫోన్ పోయిన రోజునే దాంట్లో సమయం ఆగిపోయింది. అస్పష్టమైన సెల్ఫీలు, ఆకులు, చెట్ల ఫోటోలతో ఫోన్ గ్యాలరీ నిండి ఉంది. వీటిని రోడ్జి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. కోతి తలకిందులుగా ఉన్న సెల్ఫీ కూడా ఆ ఫోటోల్లో ఉంది.

కోతులు సెల్ఫీలపై ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. ఇండోనేషియాలోని సులవేసిలోని టాంగ్కోకో రిజర్వ్ ఫారెస్ట్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ నివసించే నరుటో అనే ఆరేళ్ల మకాక్ ఫొటోలపై ఆసక్తి చూపిన ఘటన అప్పట్లో వైరల్ అయ్యింది.బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ కోతికి తెలియకుండా ఒక కెమెరాను దాని కేజ్లో ఉంచాడు. దీన్ని గుర్తించిన ఆ కోతి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సంఘటన స్లేటర్ కు తలనొప్పిలా మారింది. ఆ ఫొటోలు, వీడియోలతో కోతికి కలిగే ప్రయోజనం ఏమీ లేదని, కోతుల ఫొటోలు, వీడియోలను వైరల్ చేసి లబ్దిపొందాలనే ఉద్దేశంతోనే అతడు ఇలా చేశాడని జంతు ప్రేమికులు అప్పట్లో గొడవ చేశారు. నరుటోను ఫోటోకు అసలు యజమానిగా ప్రకటించాలని, వన్యప్రాణి పుస్తకంలో దాని ఫొటోలను పెట్టినందుకు కాపీరైట్ ఉల్లంఘన కింద దానికి నష్టపరిహారం ఇవ్వాలని జంతు హక్కుల కార్యకర్తలు 2015 లో దాఖలు చేసిన ఫెడరల్ దావాలో వాదించారు.

మూడేళ్ల పాటు వాదనలు కొనసాగిన తరువాత, కోర్టు తీర్పు స్లేటర్కు అనుకూలంగా వచ్చింది. కోతులకు కాపీరైట్ రక్షణ కోసం వేసే దావాలు కోర్టులో చెల్లవని, జంతు హక్కుల కార్యకర్తలు కోతులకు చట్టపరమైన సంరక్షకులు కాబోరని యూఎస్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది.
Published by: Krishna Adithya
First published: September 16, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading