హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Malaysia: మ‌లేషియాలో వ‌ర‌ద‌లు.. రంగంలోకి 66,000 మంది పోలీసులు.. 21,000 మందిని ర‌క్షించిన సిబ్బంది

Malaysia: మ‌లేషియాలో వ‌ర‌ద‌లు.. రంగంలోకి 66,000 మంది పోలీసులు.. 21,000 మందిని ర‌క్షించిన సిబ్బంది

మ‌లేషియాలో వ‌ర‌ద‌ల్లో పాక్షికంగా మునిగిపోయిన కార్లు (ఫోటో - REUTERS)

మ‌లేషియాలో వ‌ర‌ద‌ల్లో పాక్షికంగా మునిగిపోయిన కార్లు (ఫోటో - REUTERS)

మ‌లేషియా (Malaysia) ని వ‌ర్షాలు అత‌లాకుత‌లం అవుతుంది. ఏడు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరదల కారణంగా నిరాశ్రయులైన 21,000 మందిని ఆదివారం పౌర వాలంటీర్లు ర‌క్షించారు. దాదాపుగా 66,000మంది పోలీసులు ప్ర‌జ‌ల‌కు ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...

మ‌లేషియా (Malaysia) ని వ‌ర్షాలు అత‌లాకుత‌లం అవుతుంది. ఏడు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరదల కారణంగా నిరాశ్రయులైన 21,000 మందిని ఆదివారం పౌర వాలంటీర్లు ర‌క్షించారు. మలేషియా అత్యవసర సేవలు, అధికారులు మరియు వాలంటీర్లు నిరంత‌రం ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం 66,000 కంటే ఎక్కువ మంది పోలీసులు, సైన్యం, అగ్నిమాపక శాఖ సిబ్బంది వరద నీటిలో చిక్కుకొన్న వారిని కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 21,000 మందిని సహాయక కేంద్రాలకు తరలించినట్లు రాష్ట్ర వార్తా సంస్థ బెర్నామా నివేదించింది. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నందున, ప్రధాన మంత్రి ఇస్మాయిల్ సబ్రి యాకోబ్ విలేకరులతో మాట్లాడారు. ముందుగా మలేషియాలోని అత్యంత సంపన్న మరియు అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన సెలంగోర్‌లో అక్కడ ఉన్న 15,000 మందిని 100 కంటే ఎక్కువ సహాయ కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.

“కొందరు (అత్యవసర సేవలు) ప్రజలు కూడా ఇక్కడి నుంచి సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. వారి వద్ద కూడా సరిపడా పరికరాలు లేకపోవడం నాకు దిగ్భ్రాంతి కలిగించింది, ”అని ప్రధాన మంత్రి ఇస్మాయిల్ సబ్రి యాకోబ్ అన్నారు.  ఆదివారం సాయంత్రం, దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని మలేషియా వాతావరణ శాఖ హెచ్చరికను ఉపసంహరించుకుంది. వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయని అధికార వ‌ర్గాలు చెబుతున్నారు.

Dalai Lama: చైనాలో వారి ఆధిప‌త్య‌మే ఎక్కువ‌.. భార‌త్‌లో ప్ర‌శాంతంగా ఉంటుంది: ద‌లైలామా


ఫిలిప్పిన్స్‌లో తుపాన్ బీభత్సం..

ఫిలిప్పైన్స్‌ (Philippines)లో భీకర తుఫాన్‌ రయ్ (Typhoon Rai) బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షాలు, ప్రచండ ఈదురు గాలులతో అపార నష్టం వాటిల్లింది. చాలా చోట్ల ఇళ్లు కుప్పకూలిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలుల చిగురుటాకులా వణికాయి. తుఫాన్  ధాటికి ఇప్పటి వరకు 75 మంది మరణించారు. పలువురు గల్లంతవగా..మరికొందరు గాయపడ్డారు. దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారంత ఇళ్లను వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుకు వెళ్లిపోయారు. భయంకరమైన తుఫాన్ ధాటికి విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. బాహ్య ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయని తెలిపారు.

చాల ద్వీపాలు ఛిన్నాభిన్నం అయ్యాయని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం తెలిపింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మిలిటరీ, కోస్ట్‌గార్డ్, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన భవన శిథిలాలు, నేలకొరిగిన చెట్లను తొలగిస్తున్నారు. ఇక వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. వారికి రేషన్ సరుకులు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాయి. గంటకు 195 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురవడం వల్లే అపార నష్టం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

First published:

Tags: Floods, International news, Malaysia

ఉత్తమ కథలు