MAJU VARGHESE QUITS AS HEAD OF WHITE HOUSE MILITARY OFFICE PVN
Maju Varghese : బైడెన్ కి షాక్..వైట్ హౌస్ మిలటరీ హెడ్ రాజీనామా
మజు వర్గీస్(ఫైల్ ఫొటో)
Indian-origin in whie house : వైట్‌హౌస్ మిలటరీ ఆఫీస్ డైరెక్టర్ పదవికి భారతీయ సంతతికి చెందిన మజు వర్గీస్ రాజీనామా చేశారు. వృత్తిరీత్యా మజు న్యాయవాది. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం కేరళ.
White House Military Office : అమెరికా అధ్యక్ష భవనం "వైట్‌హౌస్" మిలటరీ ఆఫీస్ డైరెక్టర్ పదవికి భారతీయ సంతతికి చెందిన మజు వర్గీస్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నానని, ఈ పదవిని నిర్వహించడం తనకు గర్వకారణమని శనివారం చేసిన వరుస ట్వీట్ లలో మజు వర్గీస్ పేర్కొన్నారు. దేశానికీ, అధ్యక్షుడికీ సేవచేయడం తనకు గౌరవం అంటూ, తన బృందం సభ్యులతో కలిసి చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని, కలిసి సృష్టించిన చరిత్రను గురించి వర్గీస్ ట్వీట్ చేశారు. పదవీ కాలంలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. గతంలో ఒబామా ప్రభుత్వంలో కూడా మజు పనిచేశారు.
2.5 సంవత్సరాల ప్రయాణం ముగింపు దశకు వచ్చినందున ఈ రోజు చాలా భావోద్వేగాలను అధిగమిస్తున్నా. POTUSకి సేవ చేయడం అదృష్టం. ప్రారంభలో కష్టతరమైన రోజులలో ఏర్పడిన స్నేహాలకి కృతజ్ఞతలు అని వర్గీస్ ఒక ట్వీట్ లో తెలిపారు. అన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ దేశానికి వేడుకలు జరుపుకోవడానికి ఒక రోజుని అందించినందుకుజో బైడెన్ కి కృతజ్ఞతలు. వైట్ హౌస్ మిలిటరీ ఆఫీసులోని పురుషులు మరియు మహిళలు కృతజ్ఞతలు అని మరో ట్వీట్ లో వర్గీస్ చెప్పాడు. WHMOకి నాయకత్వం వహించడం జీవితకాల గౌరవం అని ట్వీట్ లో వర్గీస్ పేర్కొన్నారు. ఇక,తన తదుపరి కార్యాచరణను మజు వెల్లడించలేదు. మజు అద్భుతమైన పనితీరు కనపరిచారని వైట్‌హౌస్ అధికారులు ప్రశంసించారు.
కాగా,వైట్ హౌస్ మిలటరీ ఆఫీస్....అధ్యక్షుడి ప్రయాణ సంబంధింత విషయాలూ, వైద్య వ్యవహారాలూ, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రి సౌకర్యాలు తదితర విషయాలను నిర్వహిస్తుంది. వైట్‌హౌస్‌లో వైద్య సహాయం, అత్యవసర వైద్య సేవలు, దేశంలో అయినా విదేశాల్లో అయినా అధ్యక్షుడి ప్రయాణాలు, కమ్యూనికేషన్లు, అధికారిక వేడుకల కోసం సైనిక శాఖలతో వైట్ హౌస్ మిలటరీ ఆఫీస్ హెడ్ సమన్వయం చేసుకుంటారు.
వృత్తిరీత్యా మజు న్యాయవాది. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం కేరళ. మజు జన్మించింది మాత్రం న్యూయార్క్ సిటీలోనే. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జో బైడెన్ ప్రచార కార్యక్రమంలో మజు కీలక పాత్ర వహించారు. బైబెన్ 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సీనియర్ సలహాదారు మరియు సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా మజు వ్యవహరించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.