MAJOR GENERAL CHRIS DONAHUE WAS THE LAST AMERICAN TO LEAVE AFGHANISTAN CHECK FULL STORY JNK GH
Afghanistan: అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లి పోయిన చివరి అమెరికన్ ఆర్మీ అధికారి ఎవరో తెలుసా?
అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయిన చివరి అమెరికా ఆర్మీ అధికారి ఇతనే (PC: Twitter)
సోమవారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆఖరి బ్యాచ్ సైన్యాన్ని తరలించింది. దీనికి సంబంధించి అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేసింది.
అఫ్గానిస్తాన్‌లో (Afghanistan) 20 సంవత్సరాల యుద్ధానికి అమెరికా (America) ముగింపు పలికిన విషయం తెలిసిందే. తాలిబన్‌తో (Taliban) చేసుకున్న ఒప్పందం మేరకు గత కొన్ని వారాలుగా అగ్రరాజ్యం తమ బలగాలను, పౌరులను అఫ్గాన్ నుంచి తరలిస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. సోమవారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kabul International Airport) నుంచి ఆఖరి బ్యాచ్ సైన్యాన్ని తరలించింది. దీనికి సంబంధించి అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. ఈ విభాగం ట్విట్టర్లో షేర్ చేసిన ఫోటోలో, ఆర్మీ మేజర్ జనరల్ క్రిస్ డొనహ్యు.. అఫ్గాన్ నుంచి వెనక్కు వచ్చిన చివరి అమెరికన్ సైనికుడు అని పేర్కొంది.
ఒక ఫోటోగ్రాఫర్ నైట్ విజన్ ఆప్టిక్స్ ఉపయోగించి ఈ ఫోటో తీశారు. 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండర్ జనరల్ క్రిస్ డొనహ్యు.. రవాణా విమానంలోకి అడుగుపెట్టినట్లు ఫోటోలో కనిపిస్తోంది. అఫ్గాన్ నుంచి యూఎస్‌కు బయలుదేరిన చివరి అధికారి ఆయనేనని డిఫెన్స్ డిపార్ట్మెంట్ ట్వీట్లో పేర్కొంది. కాబూల్ నుంచి బయలుదేరిన డొనహ్యు నిష్క్రమణతో.. అఫ్గానిస్థాన్ నుంచి యూఎస్, నాటో మిత్రదేశాల సైనిక బలగాల తరలింపు ముగిసింది.
అఫ్గాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకోవడానికి అమెరికా ఆగస్టు 31 తేదీని గడువుగా నిర్ణయించింది. అయితే తుది గడువుకు ముందే ప్రక్రియను ముగించింది. కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి చివరి యూఎస్ రవాణా విమానం బయలుదేరిన తరువాత తాలిబన్లు సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్య సైనికులు వెళ్లిపోవడంతో అఫ్గానిస్థాన్‌కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్లు భావించి.. గాల్లోకి కాల్పులు జరుపుతూ వేడుకలు చేసుకున్నారు.
తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెల్లవారుజామున మాట్లాడుతూ.. అమెరికా సైనికులు కాబూల్ విమానాశ్రయాన్ని విడిచివెళ్లారని చెప్పారు. దీంతో తమ దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. 20 సంవత్సరాల సంఘర్షణలో దాదాపు 2,500 మంది US సైనికులు, 2,40,000 అఫ్గాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
* ఎన్నో ఆటంకాల నడుమ..
ఆగస్టు 15 తరువాత అమెరికా, మిత్రదేశాలు తమ పౌరులతో పాటు స్థానిక రాయబార కార్యాలయ సిబ్బంది, పౌర హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, ట్రాన్స్‌లేటర్లు, తమకు గతంలో సహకరించిన అఫ్గాన్ వాసులను తరలించాయి. ఇటీవల ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్ ఉగ్రసంస్థ ఆత్మాహుతి బాంబు దాడిలో.. కాబూల్ విమానాశ్రయం వద్ద 13 మంది US సిబ్బందితో పాటు 170 మంది స్థానికులు చనిపోయారు. దీంతో తరలింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఐఎస్-కే మరోసారో దాడులకు ప్రయత్నించగా, అమెరికా నిరోధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.