Earthquake: 7.5 తీవ్రతతో భారీ భూకంపం... స్వల్ప సునామీతో హడలెత్తిన ప్రజలు

Earthquake: భూమిలో ఏదో జరుగుతోంది. లేకపోతే ఇంత భారీ భూకంపం వచ్చే పరిస్థితి ఉండదు. భూగోళ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 20, 2020, 8:58 AM IST
Earthquake: 7.5 తీవ్రతతో భారీ భూకంపం... స్వల్ప సునామీతో హడలెత్తిన ప్రజలు
Earthquake: 7.5 తీవ్రతతో భారీ భూకంపం... (credit - twitter)
  • Share this:
Earthquake: అమెరికా... అలస్కా తీరంలో... భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.5 గా నమోదైంది. దాని వల్ల సోమవారం చిన్నపాటి సునామీ... తీరానికి వచచింది. ఐతే... భూకంపం వల్ల ఎంత నష్టం వచ్చిందన్నది, ఎంత మంది చనిపోయారన్నది ఇంకా అంచనా వెయ్యలేదు. వచ్చింది భారీ భూకంపం కాబట్టి... నష్టం ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేయగానే... తీరం వెంట ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

అలస్కాలో భూకంపం వచ్చిన ప్రాంతానికి దగ్గర్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం శాండ్ పాయింట్ తీరంలో... అలలు... 2 అడుగుల ఎత్తుకి ఎగసిపడ్డాయని రికార్డ్ అయ్యింది. తీరం నుంచి 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకూ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.



భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల దూరంలో అంకోరేజ్ నగరం ఉంది. అక్కడ వరకూ భూకంపం ప్రభావం ఉండవచ్చంటున్నారు. మొదట్లో భారీ సునామీ రావచ్చని అంచనా వేసినా... తర్వాత స్వల్ప సునామీగా హెచ్చరికను మార్చారు. ఐతే... భూమి చాలా లోతున భూకంపం వచ్చింది కాబట్టి... మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది.



భూకంపానికి ముందు... ఐదు సార్లు... 5.0 తీవ్రతతో చిన్న భూకంపాలు వచ్చాయంటున్నారు. ఐతే... ఇప్పుడు వచ్చిన భూకంపానికి దగ్గర్లోనే మూడు నెలల కిందట 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అలస్కా ప్రాంతం... అగ్ని పర్వతాలు ఉండే... రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. అందువల్ల అక్కడ తరచుగా భూమిలో పలకలు కదులుతూనే ఉంటాయి. అందువల్లే భారీ భూకంపాలు వస్తున్నాయని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 20, 2020, 8:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading