• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MAHINDA RAJAPAKSA LED SLPP REGISTERS LANDSLIDE VICTORY IN SRI LANKAS PARLIAMENTARY POLLS MK

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో మహేంద్ర రాజపక్సే పార్టీ ఘన విజయం...

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో మహేంద్ర రాజపక్సే పార్టీ ఘన విజయం...

శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో ఆ దేశ పీపుల్స్ పార్టీ (ఎస్‌ఎల్‌పిపి) మళ్లీ ఘన విజయం సాధించింది. దీంతో మహేంద్ర రాజపక్సే శ్రీలంక ప్రధానిగా కొనసాగనున్నారు.

  • Share this:
    శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో ఆ దేశ పీపుల్స్ పార్టీ (ఎస్‌ఎల్‌పిపి) మళ్లీ ఘన విజయం సాధించింది. దీంతో మహేంద్ర రాజపక్సే శ్రీలంక ప్రధానిగా కొనసాగనున్నారు. గతేడాది నవంబర్ నుంచి దేశానికి కేర్ టేకర్ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. ఇక 9 నెలల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్సే పార్టీ విజయం సాధించింది. మహీంద్ర తమ్ముడు గోటబయ రాజపక్స ఇప్పటికే దేశ రాష్ట్రపతి. కరోనా వైరస్ ఉన్నప్పటికీ శ్రీలంకలో ఎన్నికలు జరిగాయి. అయితే, అంటువ్యాధి కారణంగా, ఎన్నికల తేదీలను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

    కాగా మహీంద్ర రాజపక్స పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు తొలి నాళ్లలోనే ఆశాభావం వ్యక్తం చేశారు కానీ. మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తన తమ్ముడిని గత ఏడాది డిసెంబర్‌లో 69 లక్షల మంది ఓటర్లు అధ్యక్షుడిని చేశారని, ఈసారి ఇలాంటి మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు.



    ప్రధాని మోదీ అభినందన
    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సేతో మాట్లాడి నిన్న పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు శ్రీలంక ప్రభుత్వం మరియు ఎన్నికల సంస్థలను ప్రధాని మోడీ ప్రశంసించారు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు