Home /News /international /

MAHATMA GANDHI STATUE VANDALISED IN NEW YORK PVN

Gandhi Statue : గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం

గాంధీ విగ్రహం(ఫైల్ ఫొటో)

గాంధీ విగ్రహం(ఫైల్ ఫొటో)

Gandhi Statue Vandalised : గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి. కాగా,ప్రస్తుతం ధ్వంసం చేయబడ్డ 8 అడుగుల గాంధీ విగ్రహాన్ని

Gandhi Statue Vandalised : అమెరికాలోని న్యూయార్క్ లో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ధ్వంసం చేశారు. ప్రవాస భారతీయులతోపాటు భారత కాన్సులేజ్‌ జనరల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదొక పిరికి పందల చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని,ఘటనపై వేగవంతమైన దర్యాప్తు మరియు నిందితులపై తగిన చర్యల కోసం ఈ విషయాన్ని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు భారత కాన్సులేజ్‌ జనరల్‌ తెలిపింది.

అయితే, అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి. కాగా,ప్రస్తుతం ధ్వంసం చేయబడ్డ 8 అడుగుల గాంధీ విగ్రహాన్ని న్యూయార్క్​ యూనియన్​ స్కేర్​లో 1986 అక్టోబరు 2న ఏర్పాటు చేశారు. బాపూజీ 117వ జయంతిని పురస్కరించుకుని గాంధీ స్మారక అంతర్జాతీయ ఫౌండేషన్‌ దీనిని బహూకరించింది. దీనిని కొన్ని కారణాలతో 2001లో తొలగించి 2002లో మళ్లీ పునరుద్ధరించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Mahatma Gandhi, Statue of Unity, USA

తదుపరి వార్తలు