హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

మలేసియా ప్రధాని మహతిర్‌ మహ్మద్ రాజీనామా... ఇండియాకి మేలు జరుగుతుందా?

మలేసియా ప్రధాని మహతిర్‌ మహ్మద్ రాజీనామా... ఇండియాకి మేలు జరుగుతుందా?

మహతిర్‌ మహ్మద్ (File)

మహతిర్‌ మహ్మద్ (File)

Mahathir Mohamad Resignation : మొదటి నుంచీ మహతిర్ మహ్మద్... ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం ఇండియాతో మలేసియాకి సత్సంబంధాలు లేవు.

Mahathir Mohamad Resignation : మలేసియా ప్రధాన మంత్రి మహతిర్‌ మహ్మద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాజీనామా లెటర్‌ను మలేసియా రాజుకు పంపారు. దాంతో ప్రధాన మంత్రి పదవికి మహతిర్‌ మహ్మద్ రాజీనామా చేసినట్టు ప్రధాని ఆఫీస్ ప్రకటించింది. ఆయన పార్టీ పర్తి ప్రభూమి బెర్సతు మలేసియా కూడా అధికార కూటమి నుంచి వైదొలిగింది. ఐతే... కొన్నాళ్లుగా... ప్రభుత్వాన్ని ఎలాగైనా దించేయాలని భాగస్వామ్య పార్టీలే యత్నిస్తున్నాయి. ముఖ్యంగా కూటమిలోని మరో నేత అన్వర్ ఇబ్రహీంకి పగ్గాలు అప్పగించాలని పార్టీలు కోరుతున్నాయి. ఇలాంటి సమయంలో... 94 ఏళ్ల మహతిర్... తాను ఇక కొనసాగలేనని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అన్వర్‌ ఇబ్రహీంకి పగ్గాలు అప్పగించడం మహతిర్ మహ్మద్‌కి ఇష్టంలేదు.

ఐతే... మహతిర్ మహ్మద్ వైదొలగడం భారత్‌కి కలిసొచ్చే అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. భారత్‌లో ఓ వర్గం వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న మహతిర్... తరచూ భారత కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. జమ్మూకాశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే... CAA చట్టంపైనా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే మలేసియా నుంచీ పామ్ ఆయిల్ దిగుమతుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ప్రపంచంలోనే పామాయిల్ ఉత్పత్తిలో రెండో పెద్ద దేశంగా ఉన్న మలేసియాకు ఇండియా తీసుకున్న నిర్ణయం పెద్ద షాకే ఇచ్చినట్లైంది.

మలేసియాతో మొదటి నుంచీ శతాబ్దాలుగా భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. వాటిని కొనసాగించాలంటే... మహతిర్ మహ్మద్ అధికారంలో ఉండగా కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఆయన పదవికి రాజీనామా చేశారు కాబట్టి... కొత్తగా ఎన్నికయ్యే నేత ఎవరన్నదాన్ని బట్టీ భారత్‌-మలేసియా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి.

First published:

Tags: Malaysia

ఉత్తమ కథలు