ఇండొనేసియాలో భూకంపం.. సునామీ హెచ్చరిక

ఇండొనేసియాలోనే సుమత్రా దీవుల్లో భూకంపం వచ్చింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

news18-telugu
Updated: August 2, 2019, 6:52 PM IST
ఇండొనేసియాలో భూకంపం.. సునామీ హెచ్చరిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇండొనేసియాలో భూకంపం వచ్చింది. ఇండొనేసియాలోని సుమత్రా దీవుల్లో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండొనేసియాలోని బాంటన్ కోస్ట్, జావాలాంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వారు వెంటనే ఖాళీ చేయాలని, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిపోవాలంటూ సునామీ హెచ్చరికల కేంద్రం సూచించింది. ఇండొనేసియాను వరుస భూకంపాలు వెంటాడుతూ ఉంటాయి. 2004లో వచ్చిన అతి భారీ భూకంపంతో సునామీ వచ్చింది. అది భారత్ మీద కూడా ప్రభావం చూపింది. సుమారు 2లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సముద్రంలో అలలు సుమారు 100 అడుగుల వరకు ఎగసిపడ్డాయి.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు