Car Stolen From London Found In Pak : లండన్(London) లో మాయమైన రూ.2.30 కోట్లు విలువ చేసే ఓ లగ్జరీ బెంట్లీ కారు(Bently Car) పాకిస్తాన్(Pakistan) లో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. కొన్నివారాల క్రితం లండన్ లో అత్యంత ఖరీదైన బెంట్లీ కారుని నుండి కొందరు దుండగులు అపహరించారు. ఆ కారు పాకిస్తాన్‌కు అక్రమ మార్గంలో చేరి ఓ సంపన్నుడి చేతిలోకి వెళ్లిపోయింది. అయితే కారుని దొంగిలించిన దుండగులు .. దానిని ట్రాక్ చేసే వ్యవస్థను గుర్తించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. బెంట్లీ కారులో ఉండే అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థను ఆఫ్ చేయకపోవడంతో లండన్ లోని నేర విభాగం వాహనం ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించగలిగింది.
యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ట్రాకర్ సాయంతో ఆ బెంట్లీ కారు ప్రస్తుతం కరాచీ(Karachi)లో ఉందని గుర్తించారు. వెంటనే పాకిస్థాన్ అధికారులకు సమాచారం అందించారు,. దీంతో కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కరాచీలోని డీహెచ్ఏ అనే ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంట్లీ కారును గుర్తించారు.
Biggest Asteroid : మరో 10 రోజుల్లో భూమిపై భారీ విధ్వంసం!
అయితే అది పాకిస్తాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉండటంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కారు ఛాసిస్ నంబర్ చూడగా అది యూకే క్రైమ్ ఏజెన్సీ ఇచ్చిన నంబర్‌తో సరిపోలింది. యజమాని సరైన పత్రాలు కూడా చూపించలేకపోవడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కారు కొన్న వ్యక్తితో పాటు దానిని అమ్మిన మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడో లండన్ లో మాయమైన లగ్జరీ కారు కరాచీలో గుర్తించడంతో అంతా ఆర్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఓ దౌత్యాధికారి పత్రాలు ఉపయోగించుకొని కారుని పాకిస్తాన్ కు తరలించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారాన్నంతా నడిపిన వారిని గుర్తించే దిశగా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: London, Luxury cars, Pakistan