హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Airplane Offer: ఆకాశంలో ప్రేమించుకునేందుకు 45 నిమిషాలు.. ఎయిర్‌లైన్స్ కంపెనీ కొత్తరకం ఆఫర్..

Airplane Offer: ఆకాశంలో ప్రేమించుకునేందుకు 45 నిమిషాలు.. ఎయిర్‌లైన్స్ కంపెనీ కొత్తరకం ఆఫర్..

విలాసవంతంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆఫర్‌ అందిస్తోంది అమెరికాలోని లాస్‌ వేగాస్‌కు చెందిన ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీ. ఈ సంస్థ పేరు Love Cloud. అంటే మబ్బుల్లో ప్రేమ.

విలాసవంతంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆఫర్‌ అందిస్తోంది అమెరికాలోని లాస్‌ వేగాస్‌కు చెందిన ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీ. ఈ సంస్థ పేరు Love Cloud. అంటే మబ్బుల్లో ప్రేమ.

విలాసవంతంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆఫర్‌ అందిస్తోంది అమెరికాలోని లాస్‌ వేగాస్‌కు చెందిన ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీ. ఈ సంస్థ పేరు Love Cloud. అంటే మబ్బుల్లో ప్రేమ.

  విలాసవంతంగా పెళ్లి (Marriage) చేసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆఫర్‌ అందిస్తోంది అమెరికాలోని లాస్‌ వేగాస్‌కు చెందిన ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీ(Airlines Company). ఈ సంస్థ పేరు Love Cloud. అంటే మబ్బుల్లో ప్రేమ(Love). $995 (సుమారు రూ. 75,000) చెల్లిస్తే మీరు మీ భాగస్వామి కలిసి ప్రైవేట్‌ విమానంలో(Private Flight) 45 నిమిషాల పాటు ఆకాశంలో హాయిగా ఎగరవచ్చు. $1195 (సుమారు రూ. 90,000) చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే ఆకాశంలోనే పెళ్లి జరిపించేందుకు ఈ కంపెనీ సిద్ధంగా ఉంది. ఇంకో 100 డాలర్లు కాదనుకుంటే వన్‌ కోర్సు మీల్స్ అందిస్తుంది. దాంతో మీరు తృప్తిపడకపోతే $1595 (సుమారు రూ.1.2 లక్షలు) చెల్లించండి ఏకంగా త్రీ కోర్స్‌ మీల్స్‌(Three Course Meals) అందిస్తామని ఈ కంపెనీ చెబుతోంది. ఈ ప్యాకేజీల్లో ఏది తీసుకున్నా దానికి మరో 300 డాలర్లు చేర్చితే మిమ్మల్ని అందమైన కారులో విమానం నిల్చునే చోటు వరకు కంపెనీ తీసుకెళ్తుంది.

  Work From Home: వర్క్ ఫ్రం హోంను అతడు ఎలా దునిర్వియోగం చేశాడో చూడండి.. ఒకేసారి 7 కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ..


  అయితే ఈ ఆఫర్ ఎవరికి పడితే వారికి కాదు, ఈ సంస్థకు చెందిన మైల్‌ హై క్లబ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. నార్త్ లాస్‌ వేగాస్‌ ఎయిర్‌పోర్టు నుంచి కార్యకలాపాలు సాగించే ఈ కంపెనీకి రెండు Cessna 414 విమానాలు ఉన్నాయి. ఈ విమానాలు సాధారణంగా జంటలే బుక్‌ చేసుకుంటాయి. కాని అదనంగా ప్రతీ వ్యక్తికి $200 చెల్లిస్తే మరో ముగ్గురు, నలుగురికి చోటు కల్పిస్తుంది. ఈ మైల్‌ హై క్లబ్‌ ఫ్లైట్‌ టికెట్‌ కొనుగోలు చేసినవారి కోసం విమానంలో జంట పరుపులు, రెడ్‌ సాటిన్‌తో రూపొందించిన తలగడలు అనేక స్వాగతం పలుకుతాయి.

  ప్రయాణికులు, పైలెట్‌కు మధ్యన ఒక కర్టెన్‌ ఉంటుంది. ఈ విమానం నడిపే పైలెట్‌ ప్రయాణం సాగినంత సేపు చెవులకు నాయిస్‌ క్యాన్సలింగ్‌ హెడ్‌ ఫోన్స్ ధరించే ఉంటారు. ప్రతీ ట్రిప్‌ పూర్తైన తర్వాత దిండ్లు, పరుపులన్నింటినీ శుభ్రం చేస్తారు. రొమాంటిక్‌ డిన్నర్‌ ఫ్లైట్‌ టికెట్‌ కొనుగోలు చేసిన కస్టమర్లకు పరుపుల స్థానంలో టేబుల్‌, ఛైర్లు, బార్‌ ఉంటుంది. అయితే ఇందులో షాంపెన్‌ తప్ప ఇతర ఆల్కాహాల్స్‌ ఏవి సర్వ్ చేయరు.

  Valentine’s Day Offer: వాలెంటైన్స్ డే ఆఫర్​తో ముందుకొచ్చిన శామ్సంగ్​.. భారీగా తగ్గిన వాటి ధరలు..


  తమ కారణంగా జంటలు విడాకులు తీసుకోకుండా ఉంటున్నాయని ఈ సంస్థ ప్రతినిధులు గర్వంగా చెప్పుకుంటున్నారు. కాలిఫోర్నియాకు చెందిన భార్యాభర్తల మధ్య చాలా విభేదాలున్నాయి. ఇక విడాకులే శరణ్యమనుకుంటున్న సమయంలో గతేడాది నవంబర్‌లో ఆ జంట లవ్‌ క్లౌడ్‌ డిన్నర్‌ ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంది. అంతే, ఆ ప్రయాణం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయి. మరో జంట కూడా ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా, వ్యక్తిగతంగా ఉందని కితాబిచ్చింది. తనకు, తన భర్తకు లవ్‌ క్లౌడ్‌ ప్రయాణం ఒక మధురానుభూతి ఇచ్చిందని ఈ కపుల్ తెలిపారు.

  First published:

  Tags: Flight, Lover, USA

  ఉత్తమ కథలు