ఇండియా మురికి దేశం... డోనాల్డ్ ట్రంప్ డర్టీ మాటలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విమర్శనాత్మకంగా మాట్లాడారు. భారత్‌లో గాలి నాణ్యత చాలా మురికిగా ఉందని ఆరోపించారు.


Updated: October 23, 2020, 1:34 PM IST
ఇండియా మురికి దేశం... డోనాల్డ్ ట్రంప్ డర్టీ మాటలు
డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విమర్శనాత్మకంగా మాట్లాడారు. భారత్‌లో గాలి నాణ్యత చాలా మురికిగా ఉందని ఆరోపించారు. భారత్, రష్యా, చైనాలో గాలి నాణ్యత ఎంత మురికిగా ఉందో చూడండి అంటూ కామెంట్ చేశాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన చివరి ప్రెసిడెన్షియల్ డిబెట్‌లో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్.. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడానికి సంబంధించి తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

ఇటువంటి వాతావరణ ఒప్పందాల వల్ల టెక్సాస్, ఓక్లాహోమా వంటి చమురు రాష్ట్రాలకు ఆర్థిక విపత్తు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి డెమొక్రాటిక్ అభ్యర్థి బిడెన్ ప్రణాళికలను ఆయన తప్పుబట్టారు. అమెరికాలో స్వచ్ఛమైన గాలి, నీరు ఉందని.. కార్బన్ ఎమిషన్స్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉందన్నారు. ఇక, తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో కూడా భారత్‌పై ట్రంప్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. కరోనా మరణాల సంఖ్యపై భారత ప్రభుత్వం కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ డిబేట్ మోదీని తన మిత్రునిగా చెప్పిన ట్రంప్.. భారత ప్రభుత్వం ఇస్తున్న సమాచారన్ని తప్పుబట్టేలా మాట్లాడటం విశేషం.

అయితే భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇంకా, ఈ చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో అమెరికాలో కరోనా మరణాలు, జాత్యహంకారం, వలస విధానం.. గురించి ప్రధానంగా ట్రంప్, జో బిడెన్‌ల మధ్య చర్చ జరిగింది.
Published by: Sumanth Kanukula
First published: October 23, 2020, 1:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading