రూ. 1000 రింగ్ రూ.7 కోట్లకు అమ్ముడుపోయింది..అదృష్టమంటే ఆమెదే..

ఆ గాజు ఉంగరం విలువను వెలకట్టేందుకు భూతద్దంతో పరిశీలించాడు వ్యాపారి. అది సాధారణ ఉంగరం కాదని 26.27 క్యారెట్ల వజ్రమని చెప్పడంతో డెబ్రా గడ్డార్డ్ నమ్మలేకపోయింది. ఎప్పుడో 970 రూపాయలకు కొన్న ఆ ఉంగరంలో వజ్రాలు పొదిగి ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తంచేసింది.

news18-telugu
Updated: February 11, 2019, 3:42 PM IST
రూ. 1000 రింగ్ రూ.7 కోట్లకు అమ్ముడుపోయింది..అదృష్టమంటే ఆమెదే..
డెబ్రా గడ్డార్డ్ (Image:Twitter)
news18-telugu
Updated: February 11, 2019, 3:42 PM IST
ఒక్కోసారి అనుకోకుండానే అదృష్టం కలిసివస్తుంది. ధనలక్ష్మి తలుపుతట్టి మరీ అష్టైశ్వర్యాలను తీసుకొస్తుంది. లాటరీల్లో జాక్‌పాట్ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు కొందరు..! డబ్బుల కట్టలు దొరికి లక్షాధికారులవుతారు ఇంకొందరు..! కానీ చిన్న గాజు ఉంగరం ఓ మహిళను మిలియనీర్ చేసింది. ఎప్పుడో ముచ్చటపడి కొన్న ఆ రింగ్...ఆమె పాలిట లంకె బిందెలా మారింది. ఒకప్పుడు దాన్ని రూ.970కి కొనుగోలు చేయగా...ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.6.7 కోట్లు చేరింది. దాంతో అప్పటి వరకు మధ్యతరగతి మహిళగా ఉన్న ఆమె.. ప్రస్తుతం కోటీశ్వరాలైపోయింది.

లండన్‌కు చెందిన డెబ్రా గడ్డర్డ్ (55) 33 ఏళ్ల కిందట ఓ బూట్ బజార్‌లో (చిన్న సంత) గాజు ఉంగరం కొనుగోలు చేసింది. అప్పట్లో దాని విలువ రూ.920 మాత్రమే. కొన్ని రోజులు ధరించి అనంతరం ఓ పెట్టెలో దాన్ని భద్రపరించింది. అలా 15 ఏళ్లుగా పెట్టెకే పరిమితమైంది ఆ రింగ్. ఐతే ఇటీవల తన తల్లి ఓ బంధువు చేతిలో మోసపోయి సర్వం కోల్పోయింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి వచ్చింది. ఈ క్రమం తల్లిని ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో గడ్డార్డ్.. తన దగ్గరున్న నగలను అమ్మాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఎన్నో ఆభరణాలను అమ్మేసింది. ఇక పెట్టెలో ఉన్న గాజు ఉంగరాన్ని కూడా నగల దుకాణానికి తీసుకెళ్లి అమ్మకానికి పెట్టింది.

ఆ గాజు ఉంగరం విలువను వెలకట్టేందుకు భూతద్దంతో పరిశీలించాడు వ్యాపారి. అది సాధారణ ఉంగరం కాదని 26.27 క్యారెట్ల వజ్రమని చెప్పడంతో డెబ్రా గడ్డార్డ్ నమ్మలేకపోయింది. ఎప్పుడో 970 రూపాయలకు కొన్న ఆ ఉంగరంలో వజ్రాలు పొదిగి ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తంచేసింది. దాన్ని నేరుగా సోత్బీ సంస్థ దగ్గరికి తీసుకెళ్లి వేలానికి పెట్టారు. వేలం ఖర్చులు పోనూ గడ్డార్డ్ చేతికి రూ.4.3 కోట్లు ముట్టాయి. ఆ సొమ్ముతో తల్లికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పింది. మిగిలిన డబ్బుతో అమెరికా టూర్‌కి ఖర్చు చేస్తానని ఆమె తెలిపింది.First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...