Britain MP: ఆ ఎంపీని హత్య చేసింది ముమ్మాటికీ ఉగ్రవాదులే.. ప్రకటించిన లండన్​ పోలీసులు

డేవిడ్​ అమిస్​ (photo: amessd_southend/twitter)

బ్రిటన్‌ పార్లమెంట్ సభ్యుడు (Britain MP) సర్ డేవిడ్ అమీస్ (David amess) హత్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్య (murder)కు పాల్పడిన పాతికేళ్ల యువకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Share this:
    బ్రిటన్‌ పార్లమెంట్ సభ్యుడు (Britain MP) సర్ డేవిడ్ అమీస్ (David amess) హత్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్య (murder)కు పాల్పడిన పాతికేళ్ల యువకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది ఉగ్రవాద చర్యలేనని (terrorist act) లండన్ పోలీసులు (London police) ప్రకటించారు. ఆ యువకుడి ఇంటితో పాటు మరో చోట సోదాలు చేసి కీలకమైన సమాచారాన్ని (information) సేకరించారు. ఉగ్రవాద కోణంలోనే హత్య జరిగిందని బ్రిటన్ పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు రావడంతో ఎంపీలదంరికీ భద్రత (security) పెంచారు.  అయితే ఓ వైపు ఎంపీని చంపింది ఉగ్రవాదులేనని పోలీసులు చెబుతుంటే.. మరోవైపు దీనిపై అధికారికంగా ఏ ఉగ్రవాద సంస్థ స్పందించలేదు.

    ఎంపీ హత్య వెనుక భారీ కుట్ర...

    ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ హత్యకు కారణం అని ప్రకటించుకోలేదు. అలాగే ఎంపీ హత్య (MP murder)లో ఒక్కరే పాల్గొన్నట్లు తెలిసింది. అతను కూడా ఫలానా ఉగ్రవాద గ్రూపునకు చెందిన వ్యక్తి అని పోలీసులు నిర్ధారించలేదు. ఎంపీ హత్య వెనుక భారీ కుట్ర ఉందని లండన్ పోలీసులు అనుమానిస్తున్నారు.

    1983 నుంచి ఎంపీ..

    సర్ డేవిడ్ అమీస్ 1983 నుంచి ఎంపీ (MP)గా ఉన్నారు.  ఎసెక్స్‌లోని సౌంత్ ఎండ్ వెస్ట్ నుంచి డేవిడ్ అమీస్ పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. నేరుగా ప్రజల్ని కలుస్తూ ఉంటారు. హత్య జరిగిన సమయంలోనూ ఎంపీ ప్రజలతో మాట్లాడుతున్నారు. సమస్యలపై చర్చించేందుకు ఓ చర్చిలో శనివారం ఆయన సమావేశం (meeting) ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన యువకుడు (youngster) హఠాత్తుగా విరుచుకుపడ్డాడు. కత్తితో  విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో డేవిడ్ అమీస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. నిందితుడ్ని సోమాలియా మూలాలున్న బ్రిటన్ పౌరుడిగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.

    ఉగ్రవాద కుట్ర

    ఉగ్రవాద కుట్ర ఉందని తేలడంతో బ్రిటన్‌ (Britain)కు చెందిన కౌంటర్ టెర్రరిజం గ్రూప్ పని ప్రారంభించింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహంతోనే ఈ ఘటన చోటు చేసుకుందేనేదనికి ప్రాథమిక ఆధారాలున్నాయని (Primary evidence) పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీలందరికీ భద్రత పెంచారు.

    రెండో సారి...

    గత ఐదేళ్ల కాలంలో బ్రిటన్‌లో ఎంపీ హత్యకు గురవడం రెండో సారి. 2016లో కూడా ఓ ఎంపీని హత్య చేశారు. సర్ డేవిడ్ అమీస్ .. అంతర్జాతీయ సమస్యలపైనా (International issues) చురుకుగా స్పందించారు. ముఖ్యంగా జంతు స‌మ‌స్యలు, అబార్షన్లకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తారు. ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల భావాజాలాలకు వ్యతిరేకం.  అందుకే ఆయన సంస్థల సానుభూతి పరులు ఆయనను టార్గెట్ (target) చేసినట్లుగా భావిస్తున్నారు. బ్రిటన్ ఎంపీ హత్యతో ప్రపంచం (world) మొత్తం నివ్వెపోయింది.
    Published by:Prabhakar Vaddi
    First published: