భారత దేశంలో బ్యాంకుల నుంచి రూ.14,000 కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్ చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి లోన్లు తీసుకున్న నీరవ్ మోదీ, ఆ స్కాం బయటపడిన తర్వాత విదేశాలకు పారిపోయారు. ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ఈడీ, సీబీఐ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ జర్నలిస్ట్‌కు లండన్ వీధుల్లో హాయిగా తిరుగుతూ కనిపించారు నీరవ్ మోదీ. అక్కడ కొత్తగా వజ్రాల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. సుమారు రూ. 9 లక్షల విలువైన జాకెట్ ధరించి విదేశాల్లో తిరుగుతుండగా ఆ జర్నలిస్ట్ వీడియో తీశారు. దీంతో నీరవ్ మోదీ లండన్‌లోనే ఉన్నట్టు ఖరారైంది. ఆయన్ను భారత్‌కు తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.