పురుగులతో బిర్యానీ వండుకుంటే యమ రుచి...ఓ మంత్రిగారి ఉచిత సలహా...

పాకిస్థాన్ కు చెందిన అగ్రికల్చర్ మంత్రి ఇస్మాయిల్ రహును అడిగితే దానికి ఆయన దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పాడు. మిడతల దండుతో కలత చెంద వద్దని వాటితో ప్రజలు బిర్యానీ చేసుకొని తింటే దాని రుచి వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

news18-telugu
Updated: November 14, 2019, 5:20 PM IST
పురుగులతో బిర్యానీ వండుకుంటే యమ రుచి...ఓ మంత్రిగారి ఉచిత సలహా...
పాకిస్థాన్ మంత్రి ఇస్మాయిల్ రహు (News18 English)
  • Share this:
పాకిస్థాన్ లోని కరాచీలో మిడతల బెడద మామూలుగా లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా మిడతల దండు ఊళ్ల మీద పడుతున్నాయి. దీంతో ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు. కోట్ల సంఖ్యలో ఊపిరి సలపకుండా మిడతలు ఊళ్ల మీద దాడి చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యపై స్పందించని పాకిస్థాన్ కు చెందిన అగ్రికల్చర్ మంత్రి ఇస్మాయిల్ రహును అడిగితే దానికి ఆయన దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పాడు. మిడతల దండుతో కలత చెంద వద్దని వాటితో ప్రజలు బిర్యానీ చేసుకొని తింటే దాని రుచి వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వాటితో రకరకాల వంటలు చేసుకొని తినవచ్చంటూ మంత్రిగారు సూచించారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వెగటు పుట్టించేలా ఉన్నాయని నెటిజన్లు మండి పడుతున్నారు. చేతగాక పోతే చేతులెత్తేయాలని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: November 14, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading