లోచ్ నెస్ రాక్షస జంతువు మిస్టరీ వీడినట్లేనా...? తాజా పరిశోధనల్లో తేలిందేంటి..?

Loch Ness Monster A Mystery : డైనోసార్ ఆకారంలో... తల, పొడవాటి మెడతో కనిపించే ఆ రాక్షస జంతువు ఏంటన్నదానిపై సైంటిస్టులు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. ఈల్ థియరీ తెరపైకి తెచ్చారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 6, 2019, 12:00 PM IST
లోచ్ నెస్ రాక్షస జంతువు మిస్టరీ వీడినట్లేనా...? తాజా పరిశోధనల్లో తేలిందేంటి..?
Loch Ness Monster A Mystery : డైనోసార్ ఆకారంలో... తల, పొడవాటి మెడతో కనిపించే ఆ రాక్షస జంతువు ఏంటన్నదానిపై సైంటిస్టులు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. ఈల్ థియరీ తెరపైకి తెచ్చారు.
  • Share this:
స్కాట్లాండ్‌లో... లోచ్ నెస్ నదిలో... తరచూ... రాక్షస బల్లుల ఆకారంలో ఏదో జీవి కనిపిస్తోంది. పొడవాటి మెడతో కనిపించే ఆ జంతువును లోచ్ నెస్ రాక్షస జంతువు అని పిలుస్తున్నారు. అది ఏంటన్నది ఇప్పటివరకూ మిస్టరీ వీడలేదు. ఇప్పటివరకూ వెయ్యి సార్లకు పైగా ఆ రాక్షస జంతువు ఆకారాలు కనిపించినట్లు అధికారికంగా రికార్డులు ఉన్నా... ఒక్కసారీ అది ఏంటన్నది ఎవరికీ తెలియలేదు. దాదాపు వెయ్యేళ్లకు పైగా ఇదో మిస్టరీగా ఉంది. ఐతే... తాజాగా నీల్ జెమ్మెల్ సైంటిస్టుల బృందం... ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. ఇప్పుడున్న ఈల్ చేపల కంటే... ఎన్నో రెట్లు పెద్దదైన ఈల్ చేపే ఇలా రాక్షస జంతువులా కనిపిస్తోందని ఆ సైంటిస్టుల బృందం అభిప్రాయపడుతోంది.


మొదటిసారిగా క్రీస్తుశకం 565లో తొలిసారిగా ఈ రాక్షస జంతువు కనిపించింది. అప్పట్లో ఐర్లాండ్‌కి చెందిన ఓ సన్యాసిని ఆ జంతువు చంపేయబోయింది. లక్కీగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పట్లో ఆ రాక్షస జంతువు గురించి పెద్ద చర్చే జరిగింది. 1930లో మరోసారి అది కనిపించింది. 25 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తున్న ఆ జంతువు... ఇద్దరు భార్యాభర్తలు చూస్తుండగా నది పక్కనే ఉన్న రోడ్డు దాటి వెళ్లిపోయింది.


ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఆ నది... రాక్షసబల్లుల కాలం నాటిదనీ... అప్పట్లో భారీ రాక్షస బల్లులు నీటిలో ఉండేవనీ ఓ కొత్త థియరీ పుట్టుకొచ్చింది. ప్లెసియోసార్ (plesiosaur) అనే చేప లాంటి భారీ డైనోసార్... ఇప్పటికీ బతికి ఉందనీ... అదే అప్పుడప్పుడూ కనిపిస్తోందనే వాదన ఉంది.


ఐతే... సైంటిస్టులు లోచ్ నెస్ నది నుంచీ... 250 చోట్ల వాటర్ DNA శాంపిల్స్ సేకరించారు. అలాంటి జంతువులు, రాక్షస బల్లుల వంటివి లోచ్‌నెస్‌లో లేవని తేల్చారు. ఇప్పటివరకూ ఉన్న అన్ని థియరీలనూ వాళ్లు తప్పుపట్టారు.


ఐతే... DNA శాంపిల్స్‌లో చాలా చోట్ల ఈల్ చేపలు (ఎలక్ట్రిక్ చేపలు - స్వయంగా కరెంటు ఉత్పత్తి చేసే చేపలు) ఉన్నట్లు తెలిసింది. అందువల్ల అతి పెద్ద ఈల్ చేపలే... అలా రాక్షస జంతువుల్లా కనిపిస్తూ ఉండొచ్చనే కొత్త థియరీ తెరపైకి వచ్చింది.


ఈల్ చేపలే ఆ జంతువులు కావచ్చంటున్న సైంటిస్టులు... అంత పెద్ద ఈల్ చేపలు ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. ఇప్పటివరకూ యూరప్‌లో దొరికిన అతి పెద్ద ఈల్ చేప బరువు 5.38 కేజీలు మాత్రమే. అందువల్ల అది లోచ్ నెస్ రాక్షస జంతువులా కనిపించే అవకాశమే లేదు. ఈల్స్ కాకుండా ఇతర నీటి జీవి ఏదైనా ఉండి ఉండొచ్చన్న అనుమానం కూడా ఉంది. మొత్తానికి తాజా థియరీతో... మరోసారి లోచ్ నెస్ మిస్టరీ తెరపైకి వచ్చినట్లైంది.
First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading