హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Nellore: వేళాంగిణీ మాతా చర్చ్‌ కోసం తమిళనాడు వరకు వెళ్లక్కర్లేదు..! ఒక్కసారి ప్రార్ధిస్తే కోరికలు తీరుతాయని నమ్మకం

Nellore: వేళాంగిణీ మాతా చర్చ్‌ కోసం తమిళనాడు వరకు వెళ్లక్కర్లేదు..! ఒక్కసారి ప్రార్ధిస్తే కోరికలు తీరుతాయని నమ్మకం

ప్రత్యేకంగా

ప్రత్యేకంగా నిలుస్తున్న వేళాంగిణిమాత చర్చ్

Nellore: వేళాంగిణీ మాతా.. చర్చ్ అంటే అందరికీ మొదట గుర్తు వచ్చేది తమిళనాడే కానీ.. ఆ మాత దయ కోసం తమిళనాడు వరకు వెళ్లాల్సిన పని లేదు.. మన దగ్గరే ఉన్న ఈ చర్చ్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడి మాతను ఒక్కసారి ప్రార్ధిస్తే.. కోరిక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore.

  దేవుడైనా ఓ అమ్మకు కొడుకే అంటారు. అందుకే దేవుడిని ఎంత‌గా ప్రార్ధిస్తామో.. ఆ దేవుడిని క‌న్న త‌ల్లిని కూడా అంతే ఆరాధిస్తాం. ఏసుక్రీస్తుకి ఎంతటి ప్రాధాన్యత ఉందో.. ఆయ‌న త‌ల్లి మేరీమాత‌ (Meri Mata)కు అంతే గొప్పగా.. క్రీస్తు భక్తులు భావిస్తారు. ఆ మేరీమాత కొలువైన ప్రదేశ‌మే నెల్లూరు జిల్లా (Nellore District) కొత్తకోడూరు స‌ముద్ర తీరం (Kotthakodoor Beach). దేశంలోనే చాలా ప్రాముఖ్యమైన.. త‌మిళ‌నాడు (Tamilnadu) వేళాంగిణి మాత చ‌ర్చ్ త‌ర్వాత అంత‌టి విశిష్టత ఈ చ‌ర్చికి కూడా ఉంది. ఇది నెల్లూరు న‌గ‌రానికి (Nellore City) సుమారు 30 కిలోమీట‌ర్ల దూరంలో కొత్తకోడూరు బీచ్ ఉంది. ఈ స‌ముద్రతీరంలోనే వేళాంగిణీ మాత చ‌ర్చ్ ఉంది.

  1987వ సంవ‌త్సరంలో స‌ముద్రతీరంలో వేళాంగిణి మాత చ‌ర్చిని నిర్మించారు. క్రిస్మస్ , జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పర్వదినాల‌ను అంత్యంత వైభ‌వంగా నిర్వహిస్తారు. ఆయా స‌మ‌యాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇక మ‌రియ‌మ్మ జ‌న్మదిన వేడుక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా జ‌రుపుతుంటారు.

  ఈ వేడుకలకు జిల్లా వాసులేకాక రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి భక్తులు కులమతాలకతీతంగా తరలివస్తారు. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ వేడుక‌ల్లో వివిధ కార్యక్రమాల‌ను నిర్వహిస్తారు. భ‌క్తులు వేలాదిగా ప్రార్థనలు చేసుకుంటారు. నిత్యం ప్రార్ధన‌ల‌తో చ‌ర్చి ప్రాంగ‌ణం మోగుతుంటుంది.

  ఇదీ చదవండి : చిన్న శేష వాహనం .. హంస వాహనంపై శ్రీవారి దర్శనం.. ఈ సేవల ప్రత్యేకతలు ఇవే

  వేళాంగిణి మాత చర్చ్‌ సముద్ర తీరాన నిర్మించ‌డంతో ఈ ప్రాంతం ప‌ర్యాట‌క ప్రదేశంతో పాటు ఆధ్మాత్మిక ప్రాంతంగా విల‌సిల్లుతోంది. ఉద‌యం ఐదున్నర గంట‌ల‌కే చ‌ర్చిలో ప్రార్ధన‌లు ప్రారంభ‌మ‌వుతాయి. ఆ స‌మ‌యంలోనూ స‌మీప ప్రాంతాల నుంచి భ‌క్తులు చ‌ర్చికి వ‌చ్చి ప్రార్ధన‌లు చేసుకుంటుంటారు. ఇక ఉద‌యం 7 గంట‌ల‌కు దివ్య బ‌లిపూజ చేస్తారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా .. మ‌రియ‌మ్మను విశ్వసించే భ‌క్తులంతా ఇక్కడికి త‌ర‌లివ‌చ్చి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాక్ష్యంగా నిలుస్తారు. ప్రతినెల మొద‌టి శ‌నివారం రోజున మ‌రియ‌మ్మ ఊరేగింపు నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెల రెండవ ఆదివారం ప్రార్ధన‌ల అనంత‌రం అన్నదానం ఏర్పాటుచేస్తారు.

  ఇదీ చదవండి : అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం.. ఈ రోజు దర్శించుకుంటే ఫలితం ఏంటో తెలుసా?

  కొత్త కోడూరుకు నిత్యం ఎంతోమంది ప‌ర్యాట‌కులు, సంద‌ర్శకులు వ‌స్తుంటారు. అలా వ‌చ్చిన వారంతా వేళాంగిణి మాత చర్చిని సంద‌ర్శిస్తారు. భ‌క్తుల కోసం, సంద‌ర్శకుల కోసం, ప‌ర్యాట‌కుల కోసం ఆల‌య ప్రాంగ‌ణంలో ఎన్నో ఏర్పాట్లు చేశారు. మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్, స్నాన‌ఘ‌ట్టాలు, బాత్ రూమ్స్, కూర్చునేందుకు అరుగులు నిర్మించారు.వీటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.  రాత్రులు నిద్ర చేయ‌డానికి జిల్లా న‌లుమూల‌ల నుంచి ఎంతోమంది భ‌క్తులు వ‌స్తుంటారు. వేళాంగిణి మాత చ‌ర్చికి ఫాద‌ర్, డైరెక్టర్‌ పి.లూకాస్‌రాజు వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సార‌ధ్యంలో అన్ని కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి.

  ఇదీ చదవండి : సీఎం క్లాస్ పీకిన ఆ 27 మంది ఎవరు? నలుగురు మంత్రలు, మాజీ మంత్రులు కూడా

  ఇక వేళాంగిణి మాత చర్చి ఆధ్వర్యంలో మూగ‌, చెవిటి పిల‌ల కోసం స్కూల్, హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. వారికి చ‌దువు నేర్పించ‌డం, వారికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి రుసుము ఇక్కడ స్వీక‌రించ‌రు. ముఖ్యంగా ఆరోగ్యం, సంతానం, విద్య , ఉద్యోగం కోసం భ‌క్తులు ఎక్కువ‌గా త‌ర‌లివ‌స్తుంటారు. మొక్కుకుని ముడుపులు క‌డుతుంటారు. వారు కోరుకున్న కోరిక‌లు నెర‌వేరిన త‌ర్వాత కూడా వ‌చ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

  అడ్రస్‌ : కోడూరు వేలంగణి మాత , తోటపల్లి గూడూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 524002.

  ఎలా వెళ్లాలి: నెల్లూరు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి ఆటో సౌకర్యం కలదు. బస్టాండ్ నుంచి కోడూరు బీచ్ బస్సు అందుబాటులో ఉంటుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Nellore

  ఉత్తమ కథలు