• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • LITTLE BOY DANCES OUTSIDE THE GATE WITH DOGS JOINING IN VIRAL VIDEO MAKES NETIZENS DAY NK

Bhangra Dance Video: కుక్క పిల్లలతో చిన్నారి భాంగ్రా డాన్స్... సూపర్ వైరల్ వీడియో

Bhangra Dance Video: కుక్క పిల్లలతో చిన్నారి భాంగ్రా డాన్స్... సూపర్ వైరల్ వీడియో

Bhangra Dance Video: కుక్క పిల్లలతో చిన్నారి భాంగ్రా డాన్స్... సూపర్ వైరల్ వీడియో (credit - twitter)

Bhangra Dance Video: ఆ చిన్నారి వేస్తున్న డాన్స్‌కి ఆ కుక్క పిల్లలు చేసిన అల్లరి కలిసి... నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. ఈ వీడియో మీరు చూడకపోతే... ఆనందాన్ని మిస్సైనట్లే...

  • Share this:
    Bhangra Dance Video: సోషల్ మీడియా చాలా మంచిది. ఒక్కోసారి అది అద్భుతమైన వీడియోలు ఇస్తుంది. నెటిజన్లు అలాంటి వీడియోలను షేర్ చేసి... అందరికీ ఆనందం పంచుతారు. కుక్క పిల్లలతో ఆడుకోవడం పిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే... పప్పీలు హాని చెయ్యవు. ఆ చిన్నారికి కూడా రెండు కుక్కలు పిల్లలు నచ్చాయి. ఓ ఇంటి గేటు బయట ఆ చిన్నారి ఉండగా... గేటు లోపల కుక్క పిల్లలు ఉన్నాయి. చిన్నారిని చూడగానే అవి అరవడం మొదలుపెట్టాయి. అవి ఎలాగూ గేటు లోపలు ఉన్నాయి కాబట్టి తనను ఏమీ చెయ్యలేవు అనుకున్న చిన్నారి... మ్యాజిక్ లేకుండానే బాంగ్రా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో పప్పీలు మరింత జోరందుకున్నాయి. చిన్నారిని భయపెట్టేందుకు అవి... పైకి జంప్ చేస్తూ అరవసాగాయి.

    మీ ఆటలు నా దగ్గర సాగవులే అన్నట్లు ఆ చిన్నారి ఎంతో జోష్‌తో బాంగ్రా డాన్స్ స్టెప్పులు వేశాడు. ఆ పప్పీలు ఎంతకీ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే... ఆ చిన్నారి అలా ఎగురుతుండటం వాటికి సరదాగా ఉంది. అందుకే అవి కూడా అరుస్తూ... అతని కదలికలను చూడసాగాయి. ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది. మ్యూజిక్ లేకుండానే ఆ చిన్నారి చక్కగా వేసిన బాంగ్రా స్టెప్పులు అందర్నీ అలరిస్తున్నాయి. ఏకంగా 50 సెకండ్లపాటూ ఈ వీడియో ఆనందాన్ని పంచుతోంది. మీరూ చూడండి.


    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సూపర్ వైరల్ అయ్యింది. ట్విట్టర్‌లో దీన్ని ఒక్క రోజులో 17లక్షల మంది చూశారంటే... ఇది ఎంతలా వైరల్ అయ్యిందో ఆలోచించుకోవచ్చు. ఈ వారంలో ఇది మరింత దూసుకుపోవడం ఖాయం. దీనికి కామెంట్లు కూడా చాలా ఫన్నీగా ఉంటున్నాయి. ఆ గేట్ తీసి పప్పీలను వదిలేస్తే... అప్పుడు చూడాలి అసలు డాన్స్ అని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. చాలా మంది ఆ చిన్నారి వేసిన డాన్స్ అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు.

    ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ... నెటిజన్లు మనకు ఆనందాన్ని పంచుతున్నారు. కరోనా మహమ్మారి వచ్చాక... కష్టాలు, నష్టాల పాలైన ప్రజలకు ఇలాంటి వీడియోలు కాస్తంత ఉపశమనం కలిగిస్తున్నాయి. వీటిని చూస్తూ... ఆ కాసేపైనా తమ బాధల్ని మర్చిపోతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: