హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Aliens: భూమిపై దిగిన గ్రహాంతరవాసులు.. సీసీ కెమెరాలో దృశ్యాలు.. షాకింగ్ వీడియో

Aliens: భూమిపై దిగిన గ్రహాంతరవాసులు.. సీసీ కెమెరాలో దృశ్యాలు.. షాకింగ్ వీడియో

సీసీ కెమెరాల్లో వింత జీవులు

సీసీ కెమెరాల్లో వింత జీవులు

రెండు చిన్న గ్రహాంతర జీవులు రోడ్డుపై ఆడుకుంటున్నట్లు అందులో ఉంది. రాత్రి వేళ అందరూ పడుకున్న తర్వాత భూమిపై దిగిన రెండు వింత జీవులు రోడ్డుపై చిన్నపిల్లల మాదిరి ఆడుకుంటూ కనిపించాయి.

ఈ అనంత విశ్వంలో ఒక్క భూమండలంపైనే జీవులు ఉన్నాయా? మనిషి లాంటి బుద్ధిజీవి ఒక్కరే ఉన్నారా? మిగతా చోట్లా లేరా? ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో మనుషుల మెదళ్లలో మెదలుతున్నాయి. వీటికి సమాధానాన్ని వెతికేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విశ్వంలోని ఇతర ప్రాంతాల్లో మేధస్సు గల జీవాన్వేషణ గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అవును.. ఏలియన్స్ (గ్రహాంతర జీవులు)పై చర్చ ఇప్పటిది కాదు. ఏలియన్స్‌పై ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో చూపించినట్లు ఉండకపోయినా.. ఇతర గ్రహాల జీవులు ఉండొచ్చనే కోణంలో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. కొందరు గ్రహాంతర జీవులు ఉన్నాయని చెబుతుంటే.. మరికొందరు మాత్రం అసాధ్యమని అంటున్నారు. ఈ క్రమంలో గ్రహాంతరవాసుల గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

భూమిపై గ్రహాంతర జీవులు దిగాయన్న ఓ వార్త అమెరికాలో సంచలనం రేపుతోంది. అంతేకాదు ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని ప్రచారం జరుగుతోంది. రెండు గ్రహాంతర జీవులు జనవాసాల మధ్య కనిపించాయని చెప్పబడుతున్న వీడియోను 'Esoteric and Paranormal World' అనే యూట్యూబ్ ఛానెల్‌ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. టెక్సాస్‌లో ఈ వీడియో రికార్డ్ చేసినట్లు తెలిపింది. రెండు చిన్న గ్రహాంతర జీవులు రోడ్డుపై ఆడుకుంటున్నట్లు అందులో ఉంది. రాత్రి వేళ అందరూ పడుకున్న తర్వాత భూమిపై దిగిన రెండు వింత జీవులు రోడ్డుపై చిన్నపిల్లల మాదిరి ఆడుకుంటూ కనిపించాయి. అక్కడ ఓ కారు కూడా కనిపించింది. ఆ పక్కనే అవి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి.

' isDesktop="true" id="618134" youtubeid="55U1jv0n0-4" category="international">

ఈ ఫుటేజీని తనకు తానుగా ఏలియన్ హంటర్‌గా చెప్పుకునే స్కాట్ సీ వారింగ్ (అమెరికా) విశ్లేషించారు. అవి నిజంగానే గ్రహాంతర జీవులు అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.'' భూమిపైకి UFO (ఎగిరే పళ్లాలు, గ్రహాంతరవాసుల వాహనాలు)లు వచ్చిన ఘటనలు చాలానే చూశాం. వాటి ద్వారా చిన్న చిన్న గ్రహాంతర జీవులు వస్తున్నాయి. కొన్ని వేగంగా ముందుకు కదులుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. ఐనప్పటికీ అవి ప్రమాదకరమైనవి కావచ్చు. ఈ వీడియోలో ఉన్న గ్రహాంతర జీవులు దేనికోసమో వెతుకుతున్నట్లుగా అనిపించింది. అవి చాలా తెలివైనవి. బుద్ధి అనేది పరిణామాన్ని బట్టి ఉండదు. భూమిపై మనుషుల జీవనశైలిని కొన్ని నిమిషాల పాటు స్వయంగా వీక్షించేందుకే వచ్చి ఉంటాయి.'' అని తన UFO Sightings Daily వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు వారింగ్.

స్కాట్ సీ వారింగ్ ఫాలోయర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతడి విశ్లేషణను సమర్థిస్తున్నారు. ఆ వీడియోలో కనిపించిన జీవులు మన భూమిపై ఉండే ఉడుతలను పోలిఉన్నాయని తెలిపారు. మరోవైపు భూమిపై గ్రహాంతర జీవులు ఉన్నాయనడానికి ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారమేమీ లేదు. ఐనప్పటికీ ఏలియన్ జాతుల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గ్రేస్ (greys), రెప్టీలియన్స్ (reptilians), డ్రకోనియన్ (draconian) జాతుల గ్రహాంతర జీవులు అప్పుడప్పుడూ భూమి మీదకు వచ్చి వెళ్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇందులో నిజం లేదని.. అసలు గ్రహాంతరవాసులే లేరని స్పష్టం చేస్తున్నారు. ఏదైమైనా ఈ వీడియో గురించి ఇప్పుడు అంతటా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

First published:

Tags: Aliens, America, Space, USA

ఉత్తమ కథలు