రోడ్డుపై సింహాల రాస్తారోకో... ఆఫ్రికాలో అరుదైన దృశ్యం

నాలుగు సింహాలు రోడ్డుపైకి రావడంతో వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అయితే కొద్దిసేపటి తరువాత ఆ మృగరాజులు మళ్లీ అడవిలోకి వెళ్లిపోయాయి.

news18-telugu
Updated: January 11, 2019, 1:56 PM IST
రోడ్డుపై సింహాల రాస్తారోకో... ఆఫ్రికాలో అరుదైన దృశ్యం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 11, 2019, 1:56 PM IST
సింహాలను దూరం నుంచే చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అవే సింహాలు మన కారుకు అడ్డంగా వస్తే ఎలా ఉంటుంది ? ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. రోడ్డుపైకి కార్లను అడ్డగించే మృగరాజులు... ట్రాఫిక్ జామ్‌కు కారణమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. మన దేశంలోని గుజరాత్ జునాగఢ్‌ ప్రాంతంతో పాటు ఆఫ్రికాలో అప్పుడప్పుడు సింహాలు ఇలా రోడ్లపై వచ్చి వాహనదారులను కొంతసేపు టెన్షన్ పెడుతుంటాయి. తాజాగా ఆఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో సింహాలు రోడ్ల మీదకు వచ్చి ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాలుగు మగ సింహాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే... రెండు వైపులా వచ్చిన వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. తమ వాహనాల ముందు ఉన్నది మృగరాజులు కావడంతో... చాలామంది వాహనదారులకు కొంతసేపు ఏం చేయాలో అర్థంకాలేదు. కొందరైతే కారు హారన్ కొట్టేందుకు కూడా సాహసించలేదు. అయితే తమ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యిందనే విషయాన్ని గమనించాయో లేక రోడ్డుపై ఎక్కువ సేపు ఉండటం ఎందుకని అనుకున్నాయో తెలియదు కానీ... నాలుగు సింహాలు సైలెంట్‌గా అడవిలోకి వెళ్లిపోయాయి. రాజసంతో ముందుకు సాగుతున్న మగ సింహాల తమ సెల్‌ఫోన్‌లో బంధించేందుకు కారులో కూర్చున్న వారంతా పోటీపడ్డారు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...