Sadhguru Jaggi Vasudev : ప్రముఖ సద్గురు జగ్గవాసుదేవ్ శక్తిమంతమైన ప్రాణ ప్రతిష్ఠ ద్వారా నేపాల్ లో లింగ భైరవి దేవిని ప్రతిష్ట చేశారు. భారతదేశం బయట, లింగ బైరవి దేవికి ఆవాసంగా ఉన్న మొట్టమొదటి దేశంగా నిలిచిన నేపాల్ దేశం. సద్గురు, ఒక రాయిని దేవతా స్వరూపంగా మలచే ప్రాణ ప్రతిష్ఠ అనే అరుదైన మార్మిక ప్రక్రియ ద్వారా లింగ భైరవి దేవిని ప్రతిష్ఠ చేశారు.లింగ భైరవి దేవి శక్తులు ఒకరి శరీరంలోని మూడు ప్రాథమిక చక్రాలను బలపరుస్తాయి; తద్వారా శరీరం, మనసు ఇంకా శక్తి వ్యవస్థలో స్థిరత్వాన్ని తెస్తాయి. మార్చి 8 2023 న యోగి, ఆధ్యాత్మికులు ఇంకా దార్శనికులు అయిన సద్గురు, మార్చి 7, 2023న, ఉత్తేజభరితమైన దివ్య శక్తి స్వరూపమైన లింగ భైరవి దేవిని ప్రతిష్ఠించగా, నేపాల్‌లోని వేలాది మంది భక్తుల చిరకాల స్వప్నం ఆనందకరమైన వాతావరణంలో సాకారం అయ్యింది.
నేపాల్, భారతదేశం బయట లింగ బైరవి దేవికి ఆవాసంగా ఉన్న మొట్టమొదటి దేశంగా నిలిచింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ, అనేక విధాలుగా నేపాల్ తో ఇంకా అక్కడి ప్రజలతో సద్గురుకు ఉన్న గాఢమైన అనుబంధాన్ని సూచిస్తుంది. సద్గురు, ఒక రాయిని దేవతా స్వరూపంగా మలచే ప్రాణ ప్రతిష్ఠ అనే అరుదైన మార్మిక ప్రక్రియ ద్వారా లింగ భైరవి దేవిని ప్రతిష్ఠ చేశారు. లింగ భైరవి దేవి శక్తులు ఒకరి శరీరంలోని మూడు ప్రాథమిక చక్రాలను బలపరుస్తాయి; తద్వారా శరీరం, మనసు ఇంకా శక్తి వ్యవస్థలో స్థిరత్వాన్ని తెస్తాయి. లౌకికమైన వాటిని పొందాలనుకున్నా , అనుభూతి చెందాలనుకున్నా లేదా వాటిని అధిగమించి వెళ్ళాలని అనుకున్నా దేవి వాటినీ ఇంకా మరెంతటినో కూడా మనకు ప్రసాదిస్తుంది.
ఈ ఆలయం అందరూ సందర్శించేందుకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1:20 వరకు, అలాగే సాయంత్రం 4:20 నుండి రాత్రి 8:20 వరకు తెరిచి ఉంటుంది. రోజుకు మూడుసార్లు - ఉదయం 7:40 లకు, మధ్యాహ్నం 12:40 లకు అలాగే రాత్రి 7:40 గంటలకు ఆరతితో కూడిన పదకొండు మంగళకరమైన నైవేద్యాలతో దేవీ అభిషేకం జరుగుతుంది.
లింగ భైరవి గురించి మాట్లాడుతూ సద్గురు, “ఎవరైతే దేవి అనుగ్రహానికి పాత్రులవుతారో, వారు జీవన్మరణాలు పేదరికం లేదా అపజయం వంటి వాటి గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఒకరు దేవీ అనుగ్రహానికి పాత్రులు కాగలిగితే, మనిషి శ్రేయస్సుగా పరిగణించే ప్రతిదీ, వారికి సొంతమవుతుంది” అంటారు.
నేపాల్‌లోని లింగభైరవి దేవి, భారతదేశం బయట ప్రతిష్ఠించబడిన మొదటి దేవి ఆలయం. సద్గురు 2010లో భారతదేశంలోని కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో మొదటి లింగ భైరవి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి భారతదేశంలోని న్యూ ఢిల్లీ, గోబీ ఇంకా సేలంలలో లింగ భైరవి ఆలయాలు వచ్చాయి. ఈ దేవాలయాలు స్త్రీలచే నిర్వహించబడే ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు. పురుషులు, మహిళలు ఇద్దరూ దర్శనం చేసుకోవచ్చు, అయితే గర్భగుడిని ఇంకా దేవిని చూసుకునేది మాత్రం కేవలం మహిళలే. ‘భైరాగిణి మా’ అని పిలువబడే ఈ మహిళలు వివిధ కులాలు, మతాలు ఇంకా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు.
దేవి నేపాల్‌కు వస్తున్న ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని, మార్చి 9న తుండిఖేల్, కంటిపాత్ వద్ద రాత్రి 6:45 - 9:15 గంటల వరకు దేవి ఉత్సవం జరుగనుంది.ఈ వేడుకలో భాగమైన నృత్యం, సంగీతం ఇంకా భక్తితో కూడిన ఆసక్తిభరితమైన సాంస్కృతిక కోలాహలాలు, ఒకరికి తీక్షనమైన భైరవి దేవి శక్తులను ఇంకా అనుగ్రహాన్ని పొందేందుకు ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయి. సద్గురు ఒక ప్రత్యేక సత్సంగాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సద్గురు దేవి గురించి అనేక అంశాలను వివరిస్తారు. అలాగే, పాల్గొనేవారిచే శక్తిమంతమైన గైడెడ్ ధ్యానాలు కూడా చేయిస్తారు.
దేవి ఉత్సవంలో పాల్గొనేవారు, ప్రతిష్టించబడిన దేవి సమర్పణలను అందుకుంటారు. వాటిలో ఒక దేవి అభయ సూత్ర, ఇది భయాలను తొలగించి ఆశయాలను సిద్ధింప చేసుకోవడంలో సహాయపడుతుంది, అలాగే ఒక ప్రత్యేక దేవి ఫోటో ఉంటాయి. తెలుగులో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. ఎనిమిదేళ్లు పైబడినవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఈ ప్రోగ్రాంకి ఉచిత రిజిస్ట్రేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి
భైరవి ఉత్సవానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లింగ బైరవి ఫోటోలు ఇంకా వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లింగ భైరవి దేవి గురించి మరింత తెలుసుకోవడం కోసం సందర్శించండి: https://lingabhairavi.org/about-bhairavi/linga-bhairavi/
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharath, Nepal, Sadhguru Jaggi Vasudev