మహా విషాదం : మధ్యధరా సముద్రంలో నౌక మునక.. 150మంది దుర్మరణం

50 people killed in a Libya shipwreck : లిబియా రాజధాని ట్రిపోలి నుంచి దాదాపు 300మంది ప్రయాణికులతో ఈ నౌకలు బయలుదేరినట్టు ఆ దేశ కోస్ట్‌గార్డ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం నుంచి 137 మందిని కాపాడినట్టు,మిగతావారు గల్లంతయ్యినట్టు చెప్పారు.

news18-telugu
Updated: July 26, 2019, 8:18 AM IST
మహా విషాదం : మధ్యధరా సముద్రంలో నౌక మునక.. 150మంది దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లిబియా అంతర్గత పోరు అక్కడ బతకలేని పరిస్థితులను కల్పించింది. దీంతో సొంత గడ్డను వీడి యూరప్‌కు వలస వెళ్తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. తాజాగా లిబియా నుంచి మధ్యదరా సముద్రం ద్వారా యూరప్‌కు బయలుదేరిన వలసజీవుల పడవలు రెండు మధ్యలోనే మునిగిపోయింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 150మంది మరణించారు. లిబియా రాజధాని ట్రిపోలి నుంచి దాదాపు 300మంది ప్రయాణికులతో ఈ నౌకలు బయలుదేరినట్టు ఆ దేశ కోస్ట్‌గార్డ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం నుంచి 137 మందిని కాపాడినట్టు,మిగతావారు గల్లంతయ్యినట్టు చెప్పారు.ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండీ విచారం వ్యక్తం చేశారు. మధ్యధరా సముద్రంలో జరిగిన నౌకా ప్రమాదాల్లో ఇప్పటివరకు ఇదే అతి పెద్దది అంటున్నారు. గతంలో జరిగిన నౌకా ప్రమాదాల్లో మొత్తం 2297మంది మరణించారు.గత మే నెలలో 70మంది నౌకా ప్రమాదంలో మరణించారు.
First published: July 26, 2019, 7:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading