Home /News /international /

LET ABHINANDAN GO PAK LEADER SAYS ARMY CHIEF WAS SHAKING AT MEET BA

Abhinandan Varthaman: అభినందన్ వర్థమాన్ ఇష్యూలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాళ్లు వణికిపోయాయి

అభినందన్ వర్థమాన్ (File)

అభినందన్ వర్థమాన్ (File)

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా కాళ్లు వణికిపోయాయి. అయితే, అది ఇప్పుడు కాదు. గతంలో. ఈ విషయాన్ని సాక్షాత్తూ పాకిస్తాన్‌కు చెందిన ప్రజాప్రతినిధి వెల్లడించారు.

    పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా కాళ్లు వణికిపోయాయి. అయితే, అది ఇప్పుడు కాదు. గతంలో. ఈ విషయాన్ని సాక్షాత్తూ పాకిస్తాన్‌కు చెందిన ప్రజాప్రతినిధి వెల్లడించారు. భారత్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పట్టుకున్న సమయంలో పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తుందని భయపడిపోయింది. అప్పట్లో జరిగిన ఘటనలను ఆ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి ఇటీవల బహిర్గత పరిచారు. ఆ రోజు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాకిస్తాన్ ప్రతిపక్షాలకు చెందిన నేతలు కొందరు హాజరయ్యారు. అలాగే, అధికార పార్టీకి చెందిన నేతలు కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో ఖురేషీ మాట్లాడుతున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాళ్లు వణికిపోయాయని ఎంపీ అయాజ్ సాదిక్ తెలిపారు. ‘పాకిస్తాన్ గనక అభినందన్ వర్ధమాన్‌ను వదిలిపెట్టకపోతే ఈ రోజు రాత్రి 9 గంటలకు మన మీద భారత్ దాడి చేస్తుంది.’ అని ఖురేషీ చెప్పిన సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా కాళ్లు వణికిపోయాయి.

    ‘నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు షా మొహమ్మద్ ఖురేషీ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశానికి రావడానికి ఇష్టపడలేదు. ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా సమావేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కాళ్లు వణుకుతున్నాయి. దేవుడి మీద భారం వేసి అభినందన్ వర్థమాన్‌ని వదిలిపెట్టండి. లేకపోతే రాత్రి 9 గంటలకు పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తుంది.’ అని ఖురేషీ చెప్పినట్టు సాదిక్ తెలిపారు. అభినందన్ వర్థమాన్ విషయంతో పాటు మిగిలిన చాలా విషయాల్లో ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయని, అయితే, అంతకు మించి మాత్రం తాము ఏమీ చేయలేదని సాదిక్ చెప్పినట్టు దునియా న్యూస్ వెబ్ సైట్ పేర్కొంది.

    భారత్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బలగాల మీద పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. సెలవులు ముగించుకుని విధులకు వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ మీద దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 40 మంది సైనికులు చనిపోయారు. అనంతరం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడితో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్న కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. అయితే, ఆ దాడి జరిగిన తర్వాత రోజు పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫైటర్ జెట్ భారత్ భూభాగంలోకి దూసుకొస్తున్న సమయంలో భారత్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధవిమానం దాన్ని తునాతునకలు చేసింది. ఆ ఫైటర్ జెట్ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలో కుప్పకూలింది. భారత ఎయిర్ ఫోర్స్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందర్ వర్థమాన్ అక్కడ చిక్కుకుపోయారు. అతడిని పాకిస్తాన్ ఆర్మీ మార్చి 1, 2019న తిరిగి భారత్‌కు అప్పగించింది. ఆ తర్వాత అతడి ధైర్య సాహసాలకు వీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Abhinandan Varthaman, Pakistan, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు