డికాప్రియో ఆస్కార్‌‌ను వెనక్కితీసుకున్న అధికారులు

సినిమా రంగంలో పనిచేస్తున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్‌కు నామీనేట్ అవ్వాలనుకుంటారు. ఇంకా అవకాశం ఉంటే..ఆస్కార్ పొందాలని ఆశపడుతారు. అలాంటిది సొంతం అనుకున్న ఆస్కార్‌ను బలవంతంగా వెనక్కి తీసేసుకుంటే ఏలా వుంటుంది.

news18-telugu
Updated: December 13, 2018, 7:30 AM IST
 డికాప్రియో ఆస్కార్‌‌ను వెనక్కితీసుకున్న అధికారులు
Leonardo Dicaprio has lost his Oscar
news18-telugu
Updated: December 13, 2018, 7:30 AM IST
సినిమా రంగంలో పనిచేస్తున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్‌కు నామినేట్ అవ్వాలనుకుంటారు. ఇంకా అవకాశం ఉంటే..ఆస్కార్ పొందాలని ఆశపడుతారు. అలాంటిది సొంతం అనుకున్న ఆస్కార్‌ను బలవంతంగా వెనక్కి తీసేసుకుంటే ఏలా వుంటుంది. వివరాల్లోకి వెలితే...

హాలీవుడ్ నటుడు లియోనార్డ్‌ డికాప్రియో.. పరిచయం అక్కర్లేని నటుడు. డికాప్రియో తనదైన నటనతో ప్రేక్షకుల మనసుదోచేస్తుంటాడు. డికాప్రయో తన జీవితంలో మొత్తం ఐదు సార్లు ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాడు. అన్ని సార్లు నామినేట్‌ అయిన.. డికాప్రియోకు 2016లో ఆ అవార్డు లభించింది. ‘ది రెవెనెంట్‌’అనే చిత్రానికి, ఎప్పటినుండో వేచి చూస్తున్న ఆస్కార్ సొంతమైంది. ఉత్తమ నటుడు కేటగిరిలో డికాప్రియోకు ఈ అవార్డు లభించింది.

2016లో పొందిన అవార్ఢుతో పాటు డికాప్రియో దగ్గర మరో ఆస్కార్‌ అవార్డు కూడా ఉంది. 1954లో మర్లోన్‌ బ్రాండో అనే హాలీవుడ్ నటుడు నటించిన‘ఆన్‌ ది వాటర్ ‌ఫ్రంట్‌’సినిమాలో నటనకు ఆయన ఆస్కార్‌ దక్కించుకున్నాడు. ఈ ఆస్కార్‌ను మలేషియాకు చెందిన జో లో అనే పెట్టుబడిదారుడు డికాప్రియోకి బహుమతిగా ఇచ్చాడు. అయితే జో లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దానికితోడు ఆయన అనేక ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తేలడంతో జోలో ఏవరేవరికైతే గతంలో బహుమతులు ఇచ్చారో...అవన్నీ ఇప్పుడు అధికారులు వెనక్కి తీసేసుకుంటున్నారు. అందులో భాగంగా డికాప్రియోకు బహుమతిగా ఇచ్చిన ఆస్కార్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు, అదీ సంగతీ.

First published: December 13, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...