హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Woman Robs Bank : బొమ్మ తుపాకీతో మహిళ బ్యాంకు దోపిడీ..ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Woman Robs Bank : బొమ్మ తుపాకీతో మహిళ బ్యాంకు దోపిడీ..ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

బొమ్మ గన్నుతో బ్యాంకులో మహిళ

బొమ్మ గన్నుతో బ్యాంకులో మహిళ

Woman Robs Bank With Toy Gun :ఓ మహిళ బొమ్మ గన్నుతో బ్యాంకులోకి ప్రవేశించింది. తుపాకీతో బ్యాంక్ ఉద్యోగులను బెదిరించి రూ.10 లక్షలు(13 వేల డాలర్లు) తీసుకెళ్లింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Woman Robs Bank With Toy Gun :ఓ మహిళ బొమ్మ గన్నుతో బ్యాంకులోకి ప్రవేశించింది. తుపాకీతో బ్యాంక్ ఉద్యోగులను బెదిరించి రూ.10 లక్షలు(13 వేల డాలర్లు) తీసుకెళ్లింది. అయితే ఆ మహిళ తన అకౌంట్ లోని డబ్బు మాత్రమే తీసుకెళ్లింది. ఆ మహిళ అలా ఎందుకు చేసిందో తెలిసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు అసలు దొంగ కానే కాదమ్మా అంటూ ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే

లెబనాన్(Lebanon) లో అక్టోబరు 2019లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైంది. దేశ జనాభాలో మూడొంతుల మందికి పైగా పేదరికంలో ఉన్నారు. ఆర్థిక సంక్షోభం నాటి నుంచి దేశం యొక్క బ్యాంకింగ్ రంగం(Banking Sector).. ప్రజలు వారి అకౌంట్ల నుంచి వారి డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధిస్తోంది. నెలకు 200 డాలర్లకు మించి సేవింగ్స్ ఖాతా నుంచి విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి లేదు. దీంతో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సలీ హఫీజ్ అనే మహిళ ఓ గ్యాంగ్ తో బుధవారం ఉదయం 11 గంటలకు రాజధాని బీరట్ లోని BLOM బ్యాంకులోకి బొమ్మ తుపాకీతో ప్రవేశించింది. ఆ బ్యాంకులో తనకున్న సేవింగ్స్ అకౌంట్ లోని 13 వేల డాలర్లు వెంటనే ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులను ఆ బొమ్మ తుపాకీతో బెదిరించింది. 2019 నుండి డాలర్ మారకపు రేటులో లెబనాన్ కరెన్సీ 90 శాతానికి పైగా పడిపోయిన నేపథ్యంలో సలీ హఫీజ్ 6 మిలియన్ లెబనీస్ పౌండ్‌లను కూడా ఎక్స్ ట్రాగా తీసుకుంది, దీని విలువ కేవలం 160 డాలర్లు మాత్రమే.

Viral Video : రైలులో ఫోన్ చోరికి యత్నించి ప్రయాణికులు చేసిన పనికి బిత్తరపోయిన దొంగ..దణ్ణం పెడతా వదలొద్దంటూ వేడుకోలు

సలీ హఫీజ్ తల్లి ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ...క్యాన్సర్ తో బాధపడుతున్న తన సోదరికి ట్రీట్మెంట్ కోసమే సలీ హఫీజ్ తన సొంత అకౌంట్ నుంచి ఇలా డబ్బు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. తన డబ్బు ఇప్పించమని అనేక సార్లు సలీ హఫీజ్ బ్యాంకు మేనేజర్‌ను వేడుకుందని, కానీ వారు ఆమె గోడు పట్టించుకోలేదని అందుకే ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలిపింది. ఇలా చేయకుంటే తన చిన్నకూతురు క్యాన్సర్ తో చనిపోయేదని తెలిపింది. తన అకౌంట్ లోని డబ్బులు తీసుకునే హక్కు సలీ హఫీజ్ కి ఉందని ఆమె తల్లి తెలిపింది. కాగా,బ్యాంకు ఘటనకు సంబంధించిన వీడియోను సలీ హఫీజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. దాంతో పాటుగా తాను ఎవరినీ చంపాలన్న ఆలోచనతో బ్యాంకులోకి వెళ్లలేదని, తన హక్కులను అందుకునేందుకే వెళ్లానని ఆమె రాసుకొచ్చింది.. ఎక్కువ మొత్తంలో క్యాష్ అవసరముందని ఎంత చెప్పినా బ్యాంక్ ఉద్యోగులు వినకపోవడంతో ఇలా చేసినట్లు ఆమె తెలిపింది.

ఒక నెల వ్యవధిలో లెబనాన్‌లో ఇటువంటి సంఘటన ఇది రెండవది. ఆగస్టు నెలలో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి చికిత్స చేయించుకోవడానికి తన సేవింగ్స్ అకౌంట్(Savings Account) లోని అమౌంట్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 42 ఏళ్ల బస్సామ్ అల్-షేక్ హుస్సేన్.. షాట్‌గన్, పెట్రోల్ డబ్బాతో బీరుట్‌లోని హమ్రా వీధిలోని ఒక బ్యాంకులోకి చొరబడి ఉద్యోగులు, కస్టమర్లను బందీలుగా ఉంచాడు. తన తండ్రి ఆపరేషన్ కోసం తనకు నిధులు అవసరమని, స్తంభింపచేసిన తన సేవింగ్స్ అకౌంట్ లోని డబ్బులని తీసుకోవడానికి అనుమతించకపోతే బ్యాంకును తగలబెడతానని, బ్యాంకులోని ప్రతి ఒక్కరినీ చంపేస్తానని బెదిరించాడు. కొన్ని గంటల ప్రతిష్టంభన తర్వాత అల్-షేక్ హుస్సేన్.. తన బ్యాంకు ఖాతాలో కొంత భాగాన్ని తీసుకునేందుకు హామీ లభించిన తర్వాత భద్రతా దళాలకు లొంగిపోయాడు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bank fraud, Robbery

ఉత్తమ కథలు