హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan Politcs : ఇమ్రాన్..భారత్ వెళ్లిపో!

Pakistan Politcs : ఇమ్రాన్..భారత్ వెళ్లిపో!

ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ చాలా కాలంగా విదేశీ నిధుల ఆరోపణలను ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీలు పాకిస్థాన్‌లో విదేశాల నుంచి విరాళాలు సేకరించలేవు. అలా చేస్తే పార్టీలను నిషేధించవచ్చు.

ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ చాలా కాలంగా విదేశీ నిధుల ఆరోపణలను ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీలు పాకిస్థాన్‌లో విదేశాల నుంచి విరాళాలు సేకరించలేవు. అలా చేస్తే పార్టీలను నిషేధించవచ్చు.

Pakistan Politics : మొత్తం 342 స్ధానాలున్న పాక్‌ పార్లమెంట్ లో మెజార్టీకి 172 ఓట్లు అవసరం. మిత్రపక్షాలు దూరం కావడం సహా, సొంత పార్టీకి చెందిన సభ్యులు కూడా దూరం కావడంతో ఇమ్రాన్‌ సర్కార్‌ మైనార్టీలో పడింది.

Pakistan Politcs :  భారత్ పై ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కుమార్తె మ‌రియం న‌వాజ్ ష‌రీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(PML-N)వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మ‌రియం... ఇండియా ఆత్మాభిమానాన్ని మెచ్చుకుంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్య‌లు స‌రిగా లేవ‌ని అన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ న‌వాజ్ ఉపాధ్య‌క్షురాలైన ఆమె మాట్లాడుతూ.. ప్ర‌ధాని ఇమ్రాన్ కు ఇండియా అంత‌గా నచ్చితే, పాకిస్తాన్ ను వ‌దిలేసి భారత్ కు వెళ్లాల‌న్నారు. అధికారం పోయిన త‌ర్వాత ఇమ్రాన్ క్రేజీగా మారార‌ని, ఆయ‌న్ను త‌న స్వంత పార్టీ నేత‌లు బ‌హిష్క‌రిస్తున్నార‌ని మ‌రియం ఆరోపించారు.

అవిశ్వాస తీర్మాణాన్ని ఎదర్కోడానికి కొన్ని గంటల ముందు శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. హిందుస్థాన్‌ పేరును ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. భారత్‌లో తనకు ఎంతో గౌరవం వచ్చిందని అన్నారు. భారత్‌ను (India) నిస్వార్థ దేశంగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. ఇండియా స్వతంత్ర విదేశాంగ విధానం ఎంతో గొప్పదని.. భారత్‌పై కుట్ర చేయడానికి ఎవరూ సాహసించరని అన్నారు. ప్రపంచంలో భారతదేశానికి ఎంతో గౌరవం ఉందని కొనియాడారు. కానీ పాకిస్థాన్ (Pakistan) ఒక బానిస దేశమని కామెంట్ చేశారు. భార‌తీయుల్ని ఖుద్దార్ ఖామ్ అంటూ ఇమ్రాన్ కీర్తించారు. అంటే ఆత్మాభిమానం క‌ల‌వార‌ని ఇమ్రాన్ త‌న ప్ర‌సంగంలో వ్యాఖ్యానించారు.

ALSO READ Russia-Ukraine War : చిన్నారులే లక్ష్యంగా ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా రాకెట్ దాడులు..52కి చేరిన మృతుల సంఖ్య

ఖాసిమ్ సూరి..ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరపకుండా..ఇది విదేశీ కుట్ర అని పేర్కొంటూ ఆ తీర్మానాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. స్పీకర్ అవిశ్వాస తీర్మాణాన్ని తిరస్కరించిన తర్వాత జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేయాలంటూ ప్ర‌ధాని ఇమ్రాన్ సిఫార్సు చేసిన కేవ‌లం 30 నిమిషాల్లోనే రాష్ట్ర‌ప‌తి ర‌ద్దు చేశారు. అయితే దీనిపై విపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా...పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని,ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ దానిపై ఓటింగ్ జరుగనుంది.

మొత్తం 342 స్ధానాలున్న పాక్‌ పార్లమెంట్ లో మెజార్టీకి 172 ఓట్లు అవసరం. మిత్రపక్షాలు దూరం కావడం సహా, సొంత పార్టీకి చెందిన సభ్యులు కూడా దూరం కావడంతో ఇమ్రాన్‌ సర్కార్‌ మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే విశ్వాస పరీక్ష ద్వారా పదవి కోల్పోయిన తొలి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ అవుతారు.

First published:

Tags: Imran khan, Pakistan

ఉత్తమ కథలు