లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకుపై బాంబు దాడి... తృటిలో తప్పించుకున్న తల్హా సయీద్

Lashkar-E-Taiba : మొదట గ్యాస్ సిలిండర్ పేలిందని అంతా అనుకున్నారు. తర్వాత ఇది వ్యూహాత్మకంగా జరిపిన దాడి అని అర్థమైంది. ఓ ఎయిర్ కండీషనర్ల రిపేర్ షాపు దగ్గర ఈ పేలుడు సంభవించింది.

news18-telugu
Updated: December 10, 2019, 11:31 AM IST
లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకుపై బాంబు దాడి... తృటిలో తప్పించుకున్న తల్హా సయీద్
తల్హా సయీద్
  • Share this:
Delhi : లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ మహమ్మద్ సయీద్ కొడుకు తల్హా సయీద్... శనివారం సాయంత్రం లాహోర్‌లో జరిగిన భారీ బాంబు దాడి నుంచీ తృటిలో తప్పించుకున్నాడు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్న పాకిస్థాన్ వర్గాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. ఈ దాడిలో ఏడుగురు లష్కరే మద్దతుదారులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. లాహోర్‌ దగ్గర్లోని ఓ మసీదు వద్ద మతపరమైన ఓ మీటింగ్ జరుగుతుండగా ఈ బాంబు దాడి జరిగింది. మొదట గ్యాస్ సిలిండర్ పేలిందని అంతా అనుకున్నారు. తర్వాత ఇది వ్యూహాత్మకంగా జరిపిన దాడి అని అర్థమైంది. ఓ ఎయిర్ కండీషనర్ల రిపేర్ షాపు దగ్గర ఈ పేలుడు సంభవించింది. బాంబు దాడి తర్వాత... ఆ షాపు తీవ్రంగా దెబ్బతింది. దాన్ని పరిశీలించిన పాకిస్థాన్ పోలీసులు... బాంబుల్లో బాల్ బేరింగ్స్ పెట్టి పేల్చారని అంటున్నారు.

మరికాసేపట్లో తల్హా సయీద్ ప్రసంగిస్తాడనగా... ఆ పేలుడు జరిగింది. ఆ సమయంలో ఆల్రెడీ ప్రసంగం చేస్తున్న ఓ లష్కర్ బోధకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి జిన్నా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఎయిర్ కండీషన్లను రిపేర్ చేసే 22 ఏళ్ల హఫీజ్ మొహమ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన ఏడుగురు లష్కరే తోయిబాతోపాటూ... దాని మాతృసంస్థ జమాత్ ఉద్దవాకు మద్దతు దారులని తెలిసింది.

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌‌ను ఉగ్రవాద కేసులో భాగంగా లాహోర్ కోర్టులో ప్రవేశపెట్టిన కొన్ని గంటల తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ కేసు డిసెంబర్ 11కి వాయిదా పడింది. దాడి వెనక ఎవరు ఉన్నారన్నది ఇంకా తెలియలేదు. లష్కరే మద్దతు దారులు మాత్రం భారత దేశానికి చెందిన రా విభాగమే ఇది చేయించిందని ఆరోపిస్తోంది.

 


ఇప్పటికీ సింగిలే అంటున్న రష్యా నటి కటారినా
ఇవి కూడా చదవండి : 

తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడిపై NIA కేసు నమోదు... ఎందుకంటే...

విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...

ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...

భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>