Home /News /international /

LANKAN NEWSPAPERS SUSPEND PUBLICATION OVER RUN OUT OF NEWSPRINT DUE TO CRISIS PVN

Sri lanka Crisis : శ్రీలంకలో న్యూస్ పేపర్ల ప్రింటింగ్ నిలిపివేత

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

Sri lanka Crisis : చాలామంది లంకేయులు ఆ దేశాన్ని వీడడానికి సిద్ధమయ్యారు. సముద్రం మార్గం ద్వారా రామేశ్వరం, ధనుస్కోడి ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇక,తమ ప్రజల కోసం శ్రీలంక ప్రభుత్వం.. భారత ప్రభుత్వాన్ని సాయం కోరింది.

Lankan Newspapers Suspend Publication : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంది. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు బతికే పరిస్థితి లేకపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే...పేపర్లు కొనలేక విద్యార్థులకు పరీక్షలనే రద్దు చేశారు. గ్యాస్‌ కొరతతో వేలాది హోటళ్లు మూతపడగా.. కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే తాజాగా న్యూస్‌ ప్రింట్‌ కొరత,ధరల పెరుగుదల కారణంగా రెండు ప్రధాన వార్తాపత్రికల ప్రింటింగ్‌ ను కంపెనీ నిలిపివేసింది. ఉపాలి పబ్లికేషన్‌కు చెందిన ఆంగ్ల దినపత్రిక "ది ఐలాండ్‌" దాని సింహళీస్‌ ఎడిషన్‌ " దివైనా" పేపర్ల ప్రింటింగ్‌ ను నిలిపివేస్తున్నామని, ఇకపై ఆన్‌లైన్‌ ఎడిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని శనివారం కంపెనీ పేర్కొంది. తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రింట్‌ ఎడిషన్‌ ప్రచురణ వాయిదా వేస్తున్నామని, పాఠకులకు విషయాన్ని తెలిపేందుకు చింతిస్తున్నామని ఉపాలీ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆదాయ మార్గాలు దెబ్బతీయడంతో శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం సంక్షోభంలో చిక్కుకున్నది. ఈ క్రమంలోనే 1981 నుంచి ప్రింట్‌ అవుతున్న ది ఐలాండ్‌ వార్తా పత్రిక ఇప్పుడు ఈ పేపర్‌ కి మారాల్సిన పరిస్థితి ఎదురైంది.

నిజానికి 2020లో కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో శ్రీలంక ఇలాంటి విపత్తును ఎదుర్కొంది. అప్పుడు ప్రధాన పరిశ్రలమైన టీ, టెక్స్‌టైల్, టూరిజం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగామారింది. అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. గ్యాస్ లేకపోవడంతో హోటళ్లు మూతబడ్డాయి. సరుకుల కోసం ప్రజలు దుకాణాల ముందు క్యూలు కట్టేవారు. సరుకుల కొరత కారణంగా కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకునేవి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇంధనం కొరత, సరుకుల కొరత, ధరల పెరుగుదలతో సంస్థలు, కంపెనీలు మూతబడ్డాయి. 1970లో కూడా శ్రీలంక ఇలాంటి పరిస్థితి చవిచూసింది. అప్పుడు కూడా శ్రీలంక వాసులు ఆకలి కేకలతో అలమటించిన విషయం తెలిసిందే.

ALSO READ Gang Rape : 10వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు!

ఇక,శ్రీలంకలో ఇటీవ.ల పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల పెట్రోల్‌ కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్రోల్‌ కోసం పంపుల్లోకి జనం వినియోగదారులు ఎగబడడంతో వారిని నియంత్రించేందుకు సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితి ఎదురైంది. చమురు కొనుగోలు కోసం వేలాది మంది గంటల తరబడి క్యూలో బారులు తీరాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. పెట్రోలు కొనేందుకు క్యూలో నిల్చున్న ముగ్గురు వృద్ధులు శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, చాలామంది లంకేయులు ఆ దేశాన్ని వీడడానికి సిద్ధమయ్యారు. సముద్రం మార్గం ద్వారా రామేశ్వరం, ధనుస్కోడి ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇక,తమ ప్రజల కోసం శ్రీలంక ప్రభుత్వం.. భారత ప్రభుత్వాన్ని సాయం కోరింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: News papers, Sri Lanka

తదుపరి వార్తలు