Home /News /international /

LANGYA HENIPA VIRUS UPDATE CHINA DEVELOPS ANOTHER NOVEL VIRUS 35 CASES REPORTED ALREADY KNOW THE SYMPTOMS OF LANGYA VIRUS MKS

Langya Virus | China: చైనాలో మరో కొత్త వైరస్‌ వ్యాప్తి.. లాంగ్యా హెనిపా వైరస్‌ లక్షణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. కరోనా కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న లాంగ్యా హెనిపా వైరస్ (Langya Henipa Virus)ను సైంటిస్టులు గుర్తించారు. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు గుర్తించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. కరోనా కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న లాంగ్యా హెనిపా వైరస్ (Langya Henipa Virus)ను సైంటిస్టులు గుర్తించారు. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) తెలిపింది.

చైనాలోని షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో లాంగ్యా హెనిపా వైరస్‌ను గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాంగ్యా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొత్త వైరస్‌ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని, మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తైవాన్‌కు చెందిన సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్ సియాంగ్ అన్నారు.

Bihar Updates : నితీశ్ అనే నేను.. 8వ సారి సీఎంగా ప్రమాణం.. డిప్యూటీగా తేజస్వీ.. 7పార్టీలకూ పదవులు..


పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్‌ సర్వేలో మేకలు, కుక్కల రక్త నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షించారు. దీంతో మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం వరకు వైరస్‌ పాజిటివ్ తేలింది. 27శాతం ఎలుకల్లో వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. చైనాలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పరీక్షలు నిర్వహించగా 35 మందిలో లాంగ్యా హెనిపా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.



లాంగ్యా హెనిపా వైరస్‌ సోకిన 26మందిలో రోగులు జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోవడంతో పాటు లివర్‌, కిడ్నీలపై వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని సైంటిస్టులు పేర్కొన్నారు. లాంగ్యా వైరస్ కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: China, Covid, Virus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు