Home /News /international /

LAB MONKEYS ESCAPE LAB MONKEYS ON THE LOOSE PRESENT POTENTIAL INFECTION RISK PVN

Lab Monkeys Escape : తప్పించుకున్న ల్యాబ్ కోతులు..ప్రపంచానికి కొత్త ప్రమాదం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Monkeys Escape : 100 కోతులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కోతులను ఓ ప్రయోగశాల(Laboratory)కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Monkeys Escape :  పెన్సిల్వేనియాలోని మాంటౌర్ కౌంటీలో దాదాపు 100 కోతులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కోతులను ఓ ప్రయోగశాల(Laboratory)కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో కోతులు గాయపడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉండగా, వాటిలో కొన్ని తప్పించుకున్నట్లు మాత్రం నిర్ధారించబడింది. తప్పించుకున్న కోతులను పట్టుకునేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో పాటు స్థానిక ప్రజల సహాయాన్ని కూడా కోరారు. పొడవాటి తోక గల నాలుగు కోతులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కోతులను ఎక్కడి నుంచి ల్యాబ్ కి తీసుకెళ్తున్నారు అనేటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై స్పందించిన పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (PETA)సంస్థ.. ఈ సంఘటన కేవలం జంతువులకే కాదు, ప్రజలకు కూడా ప్రమాదం ఉండవచ్చు అని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పించుకున్న కోతులు కనుక ప్రమాదంలో గాయపడినట్లయితే..వాటికి ఎదురయ్యే ఏ మనిషికైనా ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిపింది. మానవులకు వ్యాపించే రోగకారక క్రిములను ఇవి మోసుకెళ్తుండవచ్చుననే ఆందోళనను కూడా పెటా వ్యక్తం చేసింది.

ALSO READ Trump : ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఏకంగా ఓటింగ్ మెషిన్లనే సీజ్ చేయాలని ట్రంప్ ఆదేశించారంట!

పెటా సైన్స్ సలహాదారు డా. లిసా జోన్స్ ఎంగెల్ ఒక ప్రకటనలో... తప్పించుకున్న కోతులు వైరస్ రహితంగా ఉన్నాయని నిర్ధారించడానికి ఆధారం లేదు. అమెరికాలోని ప్రయోగశాలలలోని కోతులలో క్షయ, చాగస్ వ్యాధి, కలరా మరియు MRSA ఉన్నట్లు స్టేట్ వెటర్నరీ మరియు ఇతర రికార్డులు చూపిస్తున్నాయి అని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Fungal Infections, Monkeys

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు