హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine: ఉక్రెయిన్ ప్రధాన నగరాల స్వాధీనమే లక్ష్యంగా రష్యా ముందుకు.. ఆ నగరం స్వాధీనం..

Russia-Ukraine: ఉక్రెయిన్ ప్రధాన నగరాల స్వాధీనమే లక్ష్యంగా రష్యా ముందుకు.. ఆ నగరం స్వాధీనం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డాన్‌బాస్‌లో దాడులు మొదలైన తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లోని మొదటి నగరాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. కీవ్‌కు 350 మైళ్ల దూరంలో ఉన్న క్రెమిన్నాలో 18,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. క్రెమిన్నా నుంచి ఉక్రెయిన్‌ దళాలను ఉపసంహరించుకొన్నట్లు ప్రాంతీయ గవర్నర్ ధ్రువీకరించారు.

ఇంకా చదవండి ...

డాన్‌బాస్‌లో దాడులు మొదలైన తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లోని(Ukraine) మొదటి నగరాన్ని రష్యా(Russia) దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. కీవ్‌కు 350 మైళ్ల దూరంలో ఉన్న క్రెమిన్నాలో 18,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. క్రెమిన్నా నుంచి ఉక్రెయిన్‌ దళాలను ఉపసంహరించుకొన్నట్లు ప్రాంతీయ గవర్నర్(Governer) ధ్రువీకరించారు. క్రెమిన్నా రష్యా నియంత్రణలో ఉందని, ఉక్రెయిన్‌ సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని లుహాన్స్క్, ప్రాంతీయ గవర్నర్ సెర్హి గైడై తెలిపాడు. కొత్త స్థానాలను ఎంచుకొని రష్యాతో ఉక్రెయిన్‌(Ukraine) దళాలు పోరాడుతున్నాయని సెర్హిగైడై పేర్కొన్నాడు. క్రెమిన్నాపై అన్ని వైపుల నుంచి రష్యా దాడి చేసిందని, ఇప్పటివరకు 200 మంది పౌరులు మరణించారని గైడై చెప్పారు.

 Russian Foreign Minister: " జైశంకర్ నిజమైన దేశ భక్తుడు".. భారత విదేశాంగ మంత్రిపై రష్యా ప్రశంసలు..

క్రెమిన్నాలో ఎంత విధ్వంసం జరిగిందనేదానిపై పూర్తి సమాచారం లేదని గైడై తెలిపారు. నగరాన్ని ఖాళీ చేసిన నివాసితులు, బంధువులు కలుసుకోలేకపోతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. సుమారు 3,500 మంది నివాసితులు క్రెమిన్నాలో ఉన్నారని, మొబైల్ కనెక్టివిటీని రష్యన్ దళాలు ఆపేశాయని రిపోర్ట్స్‌ తెలుపుతున్నాయి. మాస్కో అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతానికి సమీపంలోనే క్రెమిన్నా ఉంది.

ఫుల్‌ స్వింగ్‌లో రష్యా దాడి..

క్రెమిన్నా పతనానికి ముందు, తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని ప్రాంతాలపై రష్యా ఫిరంగి దళాలు బాంబు దాడి చేశాయి. డాన్‌బాస్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలపై కూడా తీవ్రమైన బాంబు దాడులు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డాన్‌బాస్, ఖార్కివ్‌లోని 300 మైళ్ల ఫ్రంట్‌లైన్‌లో రాత్రిపూట రాకెట్లు, ఫిరంగి దళాల ద్వారా 1,260 మిలిటరీ టార్గెట్స్‌పై దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించాయి. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ నివాస ప్రాంతాలపై రష్యా భారీ బాంబు దాడులు చేస్తుంది.

రష్యా బలగాలు సివిలియన్‌ డిస్ట్రిక్ట్స్‌పై వరుస బాంబు దాడులు చేస్తున్నాయని ఖార్కివ్ మేయర్ ఇగోర్ టెరెఖోవ్ తెలిపారు. ఖార్కివ్‌లో ఒకే దాడిలో 15 మంది మరణించారని, చివరి రోజున్నరలో దాదాపు 50 మంది గాయపడ్డారని CNNకి టెరెఖోవ్ తెలిపారు. క్రెమిన్నా స్వాధీనమవడంతో డాన్‌బాస్‌లో దాడులు విజయవంతంగా జరుగుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు క్రెమిన్నా ఆగ్నేయంగా 40 మైళ్ల దూరంలో ఉన్న స్లోవియన్స్క్, క్రామాటోర్స్క్ నగరాల వైపు రష్యా దళాలు కదులుతున్నాయి.

డాన్‌బాస్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటుందా?

రష్యా తన భారీ సైనికులు, ఆయుధాలతో కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకోగలదని యూఎస్‌ థింక్‌ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ పేర్కొంది. ప్రస్తుత దాడిలో నాటకీయంగా రష్యా సైన్యం విజయం సాధించే అవకాశం లేదని ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు రష్యా దళాలు విజయవంతం కాలేదని, తక్కువ నైతికత, బలహీనమైన సమన్వయం కారణమని నివేదికలు తెలుపుతున్నాయి. ఖార్కివ్ ఎదురుదాడిలో, బైరాక్, బోబ్రివ్కా, హురిసివ్కా గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఉక్రేనియన్ దళాల విజయం సాధించాయి. ఇజియం ప్రాంతంలో అత్యధికంగా రష్యన్ దళాలు ఉన్నట్లు ఉక్రెయిన్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది.


డాన్‌బాస్‌కు ప్రవేశ ద్వారంగా ఇజియం, అక్కడ రెండు వైపుల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. ఇంతలో ఓడరేవు నగరం మారియుపోల్ కూడా రష్యా దళాలకు లొంగినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు 40,000 మంది పౌరులను బలవంతంగా తరలించారని మారియుపోల్ మేయర్ తెలిపారు. మరియూపోల్ పతనంతో ఉక్రెయిన్‌కు ఆర్థిక, వ్యూహాత్మకంగా దెబ్బతగులుతుందన్న నిపుణులు అంచానా వేస్తున్నారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు